'ప్రభాస్ కు నేనంటే చాలా ఇష్టం.. అర్థరాత్రి ఫోన్ చేసినా నా కాల్ లిఫ్ట్ చేస్తాడు'
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వ్యక్తిత్వం మరియు సింప్లిసిటీ గురించి.. ఫ్రెండ్ షిప్ కు ఇచ్చే వాల్యూ గురించి.. ఆఫ్ స్క్రీన్ లో అతని ప్రవర్తన గురించి ఇండస్ట్రీ జనాలు ఎప్పుడూ గొప్పగా చెబుతుంటారు. తాజాగా ప్రభాస్ తో 'యోగి' చిత్రాన్ని రూపొందించిన డైరెక్టర్ వివి వినాయక్ ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తో తనకున్న అనుబంధం ఎలాంటిదో తెలియజేసారు. ప్రభాస్ నటించిన 'ఛత్రపతి' చిత్రాన్ని ప్రస్తుతం హిందీలో రీమేక్ చేస్తున్న వినాయక్.. తాను అర్థరాత్రి ఫోన్ చేసినా ప్రభాస్ వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడని అంటున్నారు.
"ప్రభాస్ కు నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా ఏ మిడ్ నైట్ ఫోన్ చేసినా నా కాల్ లిఫ్ట్ చేస్తాడు'' అని వినాయక్ చెప్పుకొచ్చారు. అలానే మెగాస్టార్ చిరంజీవితో కూడా మంచి అనుబంధం ఉందని.. అప్పుడప్పుడు కాల్ చేసి ఎలా ఉన్నానని తెలుసుకుంటారని.. ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే నేను కాల్ చేస్తుంటా అని తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ - రానా కలిసి చేస్తున్న 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' రీమేక్ లో గెస్ట్ రోల్ చేస్తున్నట్లు వినాయక్ వెల్లడించారు. సినిమా డైరెక్టర్ వినాయక్ గానే కనిపిస్తానని.. రానా కాంబినేషన్ లో తన సీన్స్ ఉంటాయని చెప్పుకొచ్చాడు.
కాగా, మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన దర్శకులలో వినాయక్ ముందు వరుసలో ఉంటారు. ఫ్యాక్షన్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్.. హీరోయిజంని ఒక రేంజ్ లో ఎలివేట్ చేసే సన్నివేశాలకు వినాయక్ పెట్టింది పేరు. అయితే 'ఇంటలిజెంట్' ప్లాప్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న మాస్ డైరెక్టర్.. ప్రస్తుతం 'ఛత్రపతి' రీమేక్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను బాలీవుడ్ కు పరిచయం చేసే బాధ్యత తీసుకున్నారు.
మరోవైపు డార్లింగ్ ప్రభాస్ భారీ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్నారు. 'రాధే శ్యామ్' వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే 'సలార్' 'ఆదిపురుష్' చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఇటీవలే పాన్ వరల్డ్ 'ప్రాజెక్ట్ K' చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇండియాలోనే క్రేజీ స్టార్ గా ఉన్నాడు ప్రభాస్.