ప్రపంచంలోనే అతి పెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్లు ఏవి? అంటే రెండే రెండు ఉన్నాయని చెబుతారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని ఐమ్యాక్స్ స్క్రీన్ వరల్డ్ నంబర్ 2గా పాపులరైంది. భారతదేశంలోనే నంబర్ వన్ లార్జ్ స్క్రీన్ ఇది. ఇందులో అవతార్ 3డి చూస్తే పండోరా గ్రహంపైకి ఎక్కినట్టే ఉంటుందని అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు వరల్డ్ నంబర్ 3 అనదగ్గ స్థాయిలో ప్రభాస్ ఓ మల్టీప్లెక్స్ స్క్రీన్ ని రెడీ చేస్తుండడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది.
తన స్నేహితులు యువి క్రియేషన్స్ అధినేతలు ప్రమోద్ - వంశీలతో కలిసి డార్లింగ్ ప్రభాస్ నెల్లూరు సూళ్లూరు పేట పరిసరాల్లో పిండి పాలెం వద్ద ఓ భారీ ఎంటర్ టైన్ మెంట్ హౌస్ ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రసాద్స్ ఐమ్యాక్స్ తరహాలో 106 అడుగుల స్క్రీన్ 670 సీటింగ్ కెపాసిటీతో ఒక అద్భుతమైన స్క్రీన్ ని ఏర్పాటు చేస్తున్నారట.
ఈ భారీ కాంప్లెక్స్ కి `బాహుబలి మల్టీప్లెక్స్` అని పేరు కూడా పెట్టారు. ఇందులో లేటెస్ట్ సౌండ్ టెక్నాలజీని ఇన్ బిల్ట్ చేశారట. డాల్బీ అట్మోస్ ని సబ్ ఊఫర్స్ కనెక్టివిటీతో సీట్ ఇన్ సైడ్ నుంచి సౌండ్ వినిపించే లా ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఇక ఈ థియేటర్ ని `సాహో` రిలీజ్ తేదీన (ఆగస్టు 30) లాంచ్ చేస్తున్నారన్నది అభిమానులకు మరో ఎగ్జయిటింగ్ మ్యాటర్. ఐమ్యాక్స్.. ఏఎంబీ మాల్ తరహాలోనే ఈ థియేటర్ పేరు కూడా మార్మోగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.