ప్ర‌భాస్ 'బిల్లా' 4కె వెర్ష‌న్ రెడీ అవుతోంది

Update: 2022-08-31 02:52 GMT
బ్లాక్ బస్టర్ సినిమాల 4కె వెర్ష‌న్ల‌తో స్పెషల్ షోలు టాలీవుడ్ లో కొత్త ట్రెండ్. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అతని హార్డ్ కోర్ అభిమానులు ఒక్కడు - పోకిరి ప్రత్యేక షోలను ప్రదర్శించారు. ఆశ్చర్యకరమైన వాస్తవం ఏమిటంటే ఇవ‌న్నీ 4కే వెర్ష‌న్ లోకి రీమాస్ట‌రింగ్ చేశాక విడుద‌లై అభిమానుల‌ను అల‌రించాయి.

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అదే బాటలో తమ్ముడు- జల్సా స్పెషల్ షోలు ఏర్పాటు చేశారు. ఈ హంగామా ఆగష్టు 31 నుంచి సెప్టెంబర్ 2 (ప‌వ‌న్ బ‌ర్త్ డే ) వరకు కొన‌సాగుతుంది. ఇప్పుడు ప్రభాస్ హిట్ చిత్రం బిల్లా రీమాస్ట‌రింగ్  వెర్షన్ విడుదలకు సమయం ఆసన్నమైంది.

అతి త్వరలో బిల్లా 4కె వెర్షన్ ను రెడీ చేస్తార‌ని సమాచారం. విడుదల తేదీ ఇతర వివరాలు రానున్న రోజుల్లో ప్రకటిస్తారు.

ప్ర‌భాస్ బిల్లా హిందీలోనూ...?బాలీవుడ్ క్లాసిక్ హిట్ చిత్రం డాన్ చిత్రాన్ని తమిళంలో `బిల్లా` పేరుతో అజిత్ తో రీమేక్ చేయ‌గా విష్ణువర్ధన్ ద‌ర్శక‌త్వం వ‌హించారు. ఆ సినిమా సూపర్ హిట్టవడంతో ఆ సినిమాను మెహర్ రమేష్ దర్శకత్వంలో ప్రభాస్ తో రీమేక్ చేశారు.

అప్పట్లో ఈ సినిమా ఆశించినంత విజ‌యం సాధించ‌క‌పోయినా కానీ ప్రభాస్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్ అభిమానుల్ని ఎంతోగానో మెప్పించింది.

ఇందులో అనుష్క-  హన్సిక- నమిత ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. మరి 4కె క్వాలిటీతో ఏమేర‌కు మెప్పిస్తుందో వేచి చూడాలి. బాహుబ‌లి స్టార్ గా ప్ర‌భాస్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా బిల్లా 4 కే వెర్ష‌న్ ని హిందీలో మాస్ బెల్ట్ ల‌లో విడుద‌ల చేస్తారేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News