డార్లింగ్ ప్రభాస్ ఇటీవలే రాధేశ్యామ్ సినిమాను విడుదలకు రెడీ చేసాడని అందరూ అనుకున్నారు. కానీ మధ్యలో సినిమా ఇంకా పూర్తి కాలేదని షాకింగ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ సినిమాకి ఇంకా బాలన్స్ షూట్ మిగిలి ఉండటం ఆశ్చర్యకరం. ఓవైపు రాధేశ్యామ్ కంప్లీట్ అయిపోయిందని ప్రభాస్ అటు మాస్ సాలిడ్ మూవీ సలార్ కోసం భారీగా బాడీని మేకోవర్ చేసాడు. కండలు తిరిగిన శరీరంతో సలార్ సినిమాకు సన్నద్ధం అయ్యాడు. ఓ షెడ్యూల్ కూడా పూర్తిచేసాడు. అలాగే మరోవైపు అదే కండలు తిరిగిన దేహంతో మరో పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. అంతా సాఫిగానే ఉందనుకున్న తరుణంలో రాధేశ్యామ్ నుండి పిలుపు వచ్చింది. ప్రభాస్ హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయాడు.
అయితే రాధేశ్యామ్ కొద్దిపాటి షూటింగ్ కోసం ప్రభాస్ ఇప్పుడు కండల తిరిగిన దేహానికి పనిచెప్పాడు. ఒళ్ళు హునం చేసుకుంటూ స్లిమ్ గా తయారు అవుతున్నాడని సమాచారం. ఎందుకంటే రాధేశ్యామ్ సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమాలో ప్రభాస్ స్లిమ్ గా లవర్ బాయ్ లా కనిపించాలి కాబట్టి మరోసారి కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ గురించి ఈ వార్త తెలిసి అటు ఇండస్ట్రీవర్గాలు ఇటు అభిమానులు డెడికేషన్ కొనియాడుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇదివరకే విడుదల చేసిన రాధేశ్యామ్ గ్లింప్స్ చూస్తే ఖచ్చితంగా ప్రభాస్ ఈ సినిమాతో మంచి ఐ ఫీస్ట్ ఇవ్వనున్నట్లు అర్ధమవుతుంది. ఇదిలా ఉండగా.. రాధేశ్యామ్ మూవీ రాధాకృష్ణకుమార్ తెరకెక్కిస్తుండగా.. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. యూవి క్రియేషన్స్ వారు సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.