పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ `రాధేశ్యామ్` ప్రచారం పనుల్లో ఎంత బిజీగా ఉన్నారో చెప్పాల్సిన పనిలేదు. దొరికిన ఏ మీడియాని విడిచి పెట్టడం లేదు. ప్రచారంలో ప్రభాస్ మార్క్ వేస్తున్నారు. సినిమా నిర్మాతలు స్నేహితులే కావడంతో వాళ్లకన్నా ఎక్కువ బాధ్యతతో వ్యవహరిస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే ప్రచారం బాధ్యతలన్నింటిని తాను ఒక్కడే సింగిల్ గా మోస్తున్నారా? అన్న సందేహం రాక మానదు. అంత బాధ్యతగా ప్రభాస్ `రాధేశ్యామ్` విషయంలో వ్యవహరిస్తున్నారు. `బాహుబలి`..`సాహో` సినిమాలకు కూడా డార్లింగ్ ఇంతగా కష్టపడలేదు. మెట్రో నగరాలన్నింటిని చుట్టేస్తున్నారు.
ఇక మీడియా మిత్రుల్ని డార్లింగ్ వ్యక్తిగతంగా ఆకట్టుకుంటున్నారు. అడిగిన వాళ్లకి ఫోటోలు..సెల్పీలు ఎంతో తీరిగ్గా కుశలంగా ఇస్తున్నారు. యాంకర్లతోనూ ఎంతో ఓపిగ్గా మాట్లాడుతున్నారు. ఆ చనువుతోనే ఓ యాంకర్ మీతో ఇన్ స్టా రీల్స్ చేయాలని ఉంది అని అడిగింది. దానికి డార్లింగ్ రీల్సా అంటే ఏంటి? అని అడిగారు.
మళ్లీ ఆ యాంకర్ ఇన్ స్టా రీల్స్ సార్..అంటూ చెప్పే ప్రయత్నం చేసింది. అయినా డార్లింగ్ కి అర్ధం కాలేదు. దీంతో ఆ పక్కనే ఉన్న పీఆర్ టీమ్ ఇన్ స్టా రీల్స్ గురించి వివరించారు. దీంతో ప్రభాస్ ఇలాంటివి వద్దు తల్లోయ్ అంటూ మెల్లగా జారుకున్నారు. నవ్వుకోవడం పక్కనున్న వాళ్ల వంత్తైంది.
అయితే పాన్ ఇండియా స్టార్ అయి ఉండి ప్రభాస్ కి ఇన్ స్టా రీల్స్ గురించి తెలియకపోవడం అక్కడ కాసేపు చర్చకు దారి తీసింది. ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరా? ఆయన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండదా? అంటూ సరదాగా నవ్వుకున్నారు. అయితే ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే?
ఇన్ స్టా లో ప్రభాస్ కి భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. నిత్యం డార్లింగ్ అప్ డట్స్ గురించి వెయిట్ చేసే వాళ్లు లక్షల్లో ఉన్నారు. కానీ ఇన్ స్టా రీల్స్ గురించి తెలియదంటూ పుసుక్కున గాలి తీసేసారు డార్లింగ్. ఇది కాస్త డార్లింగ్ ఫాలోవర్స్ ని నిరుత్సాహ పరిచేదే.
నిజానికి సోషల్ మీడియాలో డార్లింగ్ పెద్దగా యాక్టివ్ గా ఉండరు. ఆయనకున్న సోషల్ మీడియా ఖాతాల్నీ పీఆర్ టీమ్ చూసుకుంటుంది. ఫోన్ తో కూడా ఎక్కువ సమయం గడపరు. ఖాళీగా ఉంటే సినిమాలు చూడటం..వాటిలో నటించడం...విదేశాలు తిరగడం...మంచి ఫుడ్ తినడం. ఇవే డార్లింగ్ టైంపాస్ పనులు. ఆ రకంగా ప్రభాస్ సోషల్ యుగంలో కాస్త వెనుకడే ఉన్నారని చెప్పొచ్చు. `రాధేశ్యామ్` రిలీజ్ తర్వాత ప్రభాస్ `ప్రాజెక్ట్ -కె`..`సలార్` షూటింగ్ ల్లో మళ్లీ బిజీ అవుతారు.