కొన్ని రోజుల క్రితం ట్విట్టర్ లో యూవీ క్రియేషన్ బ్యానర్ పై వ్యతిరేకంగా ఒక హ్యాష్ ట్యాగ్ ఏ స్థాయిలో ట్రెండ్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ 20 వ సినిమా అప్డేట్ ఇవ్వడం లేదనే కారణం తో ప్రభాస్ ఫ్యాన్స్ ఆ సినిమా నిర్మాణ సంస్థ అయినా యూవీ క్రియేషన్స్ ను ఒక ఆట ఆడేశారు. ప్రభాస్ ఫ్యాన్ సోషల్ మీడియా లో ఆ ట్రోల్స్ తెగ ట్రెండ్ అవ్వడంతో నిర్మాతలు ప్రకటన చేసే పరిస్థితి వచ్చింది.
సినిమా మేకింగ్ విషయంలో యూవీ క్రియేషన్స్ వారు వ్యవహరిస్తున్న తీరు ను ప్రభాస్ ఫ్యాన్స్ తప్పుపట్టడంతో పాటు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహానికి యూవీ క్రియేషన్స్ బలి అయ్యే పరిస్థితి రావచ్చు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ సినిమాను ఈ ఏడాది విడుదల చేయాలని భావించారు. కానీ షూటింగ్ అనుకున్నట్లుగా జరగక పోవడంతో వచ్చే ఏడాది ద్వితీయార్ధం వరకు కూడా సినిమాను విడుదల చేయలేని పరిస్థితి అంటూ మేకర్స్ చిన్న హింట్ ఇచ్చారు.
ఈ సమయంలో మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా దర్శకుడు మరియు నిర్మాతలపై కోపం తో ఉన్నారు. బాహుబలి.. సాహో సినిమాలు ఆలస్యం అయ్యాయి అంటే సరే అనుకోవచ్చు. కానీ ఈ సినిమాను రెండు సంవత్సరాలు చేయాల్సిన అవసరం ఏంటి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దర్శక నిర్మాతలకు వ్యతిరేకంగా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేసే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.