యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా `ఆది పురుష్`. బాలీవువ్ డైరెక్టర్ ఓం రౌత్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఐమ్యాక్స్ వెర్షన్ తో పాటు 3డీలోనూఈ మూవీని సర్వాంగ సుందరంగా ఓ విజువల్ ఫీస్ట్ గా అందించబోతున్నారు. టి. సిరీస్, రెట్రో ఫైల్స్ సంయుక్తంగా నిర్మిస్తన్నాయి. రాకెట్ స్పీడుతో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ గత కొన్ని నెలలుగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ప్రభాస్ నటిస్తున్న తొలి మైథలాజికల్ మూవీ ఇది. శ్రీరాముడిగా ప్రభాస్ నటిస్తున్న ఈ మూవీని వాల్మీకి రామాయణం ఆధారంగా జపనీస్ మూవీ `రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా` స్ఫూర్తితో ఈ భారీ దృశ్య కావ్యాన్ని వెండితెరపై దర్శకుడు ఓం రౌత్ అత్యంత భారీ స్థాయిలో గ్రాఫికల్ వండర్ గా తెరకెక్కించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా వున్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30న ప్రభాస్ ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇక అక్టోబర్ 2న భారీ స్థాయిలో టీజర్ ని రిలీజ్ చేస్తున్నారు. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఇందు కోసం సుందరమైన అయోధ్య హెరిటేజ్ కట్టడాల మధ్య భారీ స్టేజ్ ని ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి 7:11 నిమిషాలకు టీజర్ ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే చిత్ర బృందం ఈ విషయాన్ని సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే.
ఆదివారం ఉదయం నుంచి చిత్ర బృందానికి సంబందించిన ఒక్కొక్కరు అయోధ్యకు పయనమవుతున్నారు. ఇప్పటికే దర్శకుడు ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్, నిర్మాతలలో ఒకరైన భూషన్ కుమార్ అయోధ్యకు వెళ్లిపోయారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి క్యాజువల్ డ్రెస్ లో అయోధ్యకు వెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. క్యాజువల్ టీ షర్ట్, తలకు మంకీ క్యాప్ ధరించి ఫోన్ నొక్కుతూ హైదరాబాద్ ఏయిర్ పోర్ట్ లో ప్రభాస్ దర్శనమిచ్చిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఈ రోజు రిలీజ్ కానున్న టీజర్ తో దేశ వ్యాప్తంగా సినిమాపై హైప్ ని క్రియేట్ చేయబోతున్నారు. సైఫ్ అలీఖాన్ రావణాసుడిగా నటించిన ఈ మూవీలోని ఇతర పాత్రల్లో సన్నీ సింగ్, దేవ్ దత్త నాగే, వల్సల్ సేథీ, సోనాల్ చౌహాన్ తదతరులు నటిస్తున్నారు. దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని 2023 సంక్రాంతికి జనవరి 12న భారీ స్థాయిలో ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.