సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తొలి సారి ఆహా ఓటీటీ కోసం హోస్ట్ అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. అన్ స్టాపబుల్ టాక్ షో సీజన్ 1 తో హోస్ట్ గా మారిన బాలయ్య తనదైన స్టైల్లో షోని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలపడమే కాకుండా ఓటీటీ టాక్ షోలలో హాట్ ఫేవరేట్ టాక్ షోగా మార్చేశారు. దీంతో ఈ టాక్ షో తో బాలయ్య కూడా తనలోని కొత్త కోణాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం తెలిసిందే. అన్ స్టాపబుల్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో దీనికి కొనసాగింపుగా సీజన్ 2 ని రీసెంట్ గా మొదలు పెట్టారు.
అయితే ఫస్ట్ సీజన్ కి మించి సీజన్ 2 ఎ రేంజ్ లో ఆకట్టుకుంటూ ఆహా ఓటీటీని మరింత వైరల్ చేస్తూ వీవర్స్ ని పెంచేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేస్ లతో మొదలైన సీజన్ 2 ఎపిసోడ్ ఎపిసోడ్ కు మరింత ఆసక్తిని రేకెత్తిస్తూ వీక్షకుల్లో మరింత క్యూరియాసిటీని కలిగిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, గోపీచంద్ ల తో తాజా ఎపిసోడ్ ని సిద్ధం చేశారు. రీసెంట్ గా విడుదల చేసిన ప్రోమో నెట్టింట ట్రెండ్ అవుతోంది.
రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఈ ప్రోమో నెట్టింట ప్రస్తుతం టాప్ 5లో ట్రెండ్ అవుతోంది. డిసెంబర్ 30న ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ టాక్ షోలో ప్రభాస్ ని బాలయ్య ఎలా అడుకో బోతున్నాడు? .. అందు కోసం ప్రిపేర్ అయిన ప్రభాస్.. బాలయ్య వేసే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్పాడు.. చరణ్ కు ఫోన్ చేసిన బాలయ్య .. ప్రభాస్ తో ఎలా ఆడుకున్నాడు?.. గోపీచంద్ తీసిన ఫొటో వెనక వున్న అసలు కథేంటీ? .. అనే ఆసక్తికర విషయాలని ప్రోమోలో చెప్పేశారు.
ఇదంతా పక్కన పెడితే... `రాథేశ్యామ్` మూవీ రిలీజ్ టైమ్ లో ప్రభాస్ లుక్ పై నెట్టింట భారీ స్థాయిలో విమర్శలు వినిపించాయి. కొంత మంది ఓ రేంజ్ లో ప్రభాస్ లుక్ మీద మీమ్స్ తో ట్రోల్స్ చేశారు. ఫ్యాన్స్ ఈ ట్రోల్స్ కి సమాధానం చెప్పలేక పోయారు. కారణం ప్రభాస్ లుక్ `రాధేశ్యామ్`లో డిఫరెంట్ గా కనిపించి ప్రభాస్ ఫేస్ అదోలా కనిపించింది. దీంతో ఓ రేంజ్ లో ట్రోల్స్ మొదలయ్యాయి. పైగా చాలా స్లోగా.. నీరసంగా ప్రభాస్ చెప్పిన డైలాగ్ లపై కూడా ట్రోల్ సాగింది.
వీటన్నింటికి అన్ స్టాపబుల్ ప్రోమోతో ప్రభాస్ గట్టి కౌంటర్ ఇచ్చేశాడనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఈ షోలో ప్రభాస్ చలాకీగా మాట్లాడిన తీరు. గోదావరి యాసలో చెప్పిన డైలాగ్ లు.. `బుజ్జిగాడు` మూవీలో త్రిషని ఆటపట్టిస్తూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ని మళ్లీ అదే స్థాయిలో అన్ స్టాపబుల్ 2 ప్రోమోలో చెప్పిన తీరు అందరి మబ్బులిడిపోయేలా చేసిందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ప్రోమోలోనే ఈ రేంజ్ లో రచ్చ చేసిన ప్రభాస్ మళ్లీ తన ఒరిజినల్ వెర్షన్ లోకి వచ్చేశాడని, ఫుల్ ఎపిసోడ్ లో ఏ స్థాయిలో రచ్చ చేశాడో అని ఫ్యాన్స్ ఫుల్ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట.