వీడియో : అన్ స్టాపబుల్‌ బాహుబలి ఎపిసోడ్‌ 2 కూడా అదే జోరు

Update: 2023-01-01 08:56 GMT
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న అన్‌ స్టాపబుల్‌ షో లో ప్రభాస్ హాజరు అయిన బాహుబలి ఎపిసోడ్‌ మొదటి పార్ట్‌ ను ఇటీవలే స్ట్రీమింగ్‌ చేసిన విషయం తెల్సిందే. సూపర్‌ డూపర్ రెస్పాన్స్‌ దక్కిన నేపథ్యంలో బాహుబలి ఎపిసోడ్‌ పార్ట్‌ 2 కోసం ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా మధ్యలో ఒక వారం బ్రేక్‌ ఇవ్వకుండా వెంటనే ఈ వారంలోనే స్ట్రీమింగ్‌ కు ఆహా బాహుబలి ఎపిసోడ్‌ 2 ను సిద్దం చేసింది. అందుకు సంబంధించిన ప్రోమో ను విడుదల చేయడం జరిగింది. రెండవ ఎపిసోడ్‌ లో ఎక్కువగా ప్రభాస్ మరియు గోపీచంద్‌ ల పై ఉంటుందని ప్రోమో చూస్తూ ఉంటే అర్థం అవుతుంది.

గోపీచంద్ మరియు ప్రభాస్ లతో బాలయ్య సరదా ముచ్చట్లు ఏ స్థాయిలో ఉంటాయో ప్రోమో చూస్తూ ఉంటే అర్థం అవుతుంది. రికార్డు స్థాయి వ్యూస్ ను బాహుబలి ఎపిసోడ్‌ 1 దక్కించుకోగా.. అందుకు ఏమాత్రం తగ్గకుండా.. అంచనాలకు అనుగుణంగా రెండవ పార్ట్‌ కూడా ఉండబోతుందని అభిమానులు చాలా నమ్మకంతో అన్ స్టాపబుల్ జనవరి 6 ఎపిసోడ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు.

ప్రభాస్ ఎపిసోడ్‌ పార్ట్ 1 ను అనుకున్న రోజు కంటే కొన్ని గంటల ముందు గానే స్ట్రీమింగ్‌ చేసిన విషయం తెల్సిందే. ఒక్కసారిగా అభిమానులు ఆహా యాప్ లో లాగిన్ అవ్వడంతో దెబ్బకు సర్వర్‌ డౌన్ అయ్యింది. దాదాపు మూడు నుండి నాలుగు గంటల పాటు ఆహా టెక్నికల్‌ టీమ్‌ వర్క్ చేసి తిరిగి ఆహా ను అప్‌ చేయాల్సి వచ్చింది. పార్ట్‌ 2 ఎపిసోడ్‌ కు కూడా అదే స్థాయి స్పందన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ప్రోమోను ఒక లుక్కేయండి.

Full View
Tags:    

Similar News