ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వరుస పాన్ ఇండియా సినిమాలు హిందీ పరిశ్రమలోనూ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి 1- బాహుబలి 2 - సాహో - పుష్ప ది రైజ్ చిత్రాలతో ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమ నిరూపించింది. మన స్టార్ హీరోలు ఇరుగు పొరుగు భాషల్లో అసాధారణ వసూళ్లు తేగలరని ప్రూవ్ అయ్యింది. అందుకే ప్రాంతీయ హద్దులు చెరిపేసి యూనిక్ కాన్పెప్టులతో పాన్ ఇండియా సినిమాల్ని తెరకెక్కించేందుకు మన దర్శకనిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు.
ఇక బాహుబలి తర్వాత తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ మార్కెట్ అసాధారణంగా పెరిగింది. శాటిలైట్ డిజిటల్ హక్కుల రూపంలో వందల కోట్లు చెల్లించేందుకు హిందీ డిస్ట్రిబ్యూటర్లు వెనకాడడం లేదు. మూవీలో కంటెంట్ ఆకర్షిస్తే ఖాన్ ల సినిమాలకు ధీటుగా ధరలు చెల్లించేందుకు వెనకాడడం లేదు. ఇంతకుముందు బాహుబలి ఫ్రాంఛైజీతో పాటు.. సాహో హిందీ బెల్ట్ లో గొప్ప బిజినెస్ చేయడమే గాక .. థియేట్రికల్ రిలీజ్ లో అదరగొట్టాయి. ఉత్తరాది మాస్ కి మన హీరోలు పిచ్చిగా నచ్చేస్తున్నారని ప్రూవైంది.
ఇక ముందు ఖాన్ లకు ధీటుగా బిజినెస్ సాగించే తెలుగు హీరోల గురించి చర్చ ఇంకా పెరగనుంది. తాజాగా సల్మాన్ ఖాన్ - సాజిద్ నడియద్వాల కాంబినేషన్ లో రానున్న `కభీ ఈద్ కభీ దీపావళి` శాటిలైట్ - డిజిటల్ హక్కుల కోసం 150 కోట్ల ఆఫర్ దక్కిందని తెలిసింది. నిజానికి సాహో చిత్రానికి దాదాపు 290 కోట్ల మేర బిజినెస్ సాగితే ఇందులో మెజారిటీ పార్ట్ హిందీ పరిశ్రమ నుంచే వచ్చింది. ఆ రకంగా చూస్తే ప్రభాస్ రేంజు కూడా ఖాన్ ల రేంజుకు తగ్గడం లేదనే దీనర్థం.
సల్మాన్ భాయ్ అంతటివాడు.. సాజిద్ లాంటి ట్యాలెంటెడ్ మేకర్ కలిసినా అమాంతం రేంజు అయితే పెరగలేదు. బాలీవుడ్ టైపికల్ సినిమాలకు మొహం మొత్తేయడంతో ఇటీవల ఖాన్ లకు కూడా ఆదరణ దారుణంగా పడిపోయింది. అందుకే బిజినెస్ అక్కడ స్టాగ్నెంట్ అయ్యి ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది నిజంగానే తెలుగు సినీపరిశ్రమకు కలిసొచ్చే అంశం కానుంది. మునుముందు మన సినిమా హిందీ ఆడియెన్ కి స్పెషల్ ట్రీట్ గా మారనుంది.
జీత్- జుద్వా- హర్ దిల్ జో ప్యార్ కరేగా- ముజ్సే షాదీ కరోగే- జాన్-ఇ-మాన్ మరియు కిక్ లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత సాజిద్ నడియాద్వాలా -సల్మాన్ ఖాన్ కాంబో ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహించిన కామిక్ ఎంటర్‌టైనర్, కభీ ఈద్ కభీ దీపావళి తో బాక్సాఫీస్ పోరుకు సిద్ధమవుతున్నారు. సల్మాన్ - సాజిద్ కాంబోలో ఏడో చిత్రమిది. ఈ సినిమా మార్చి 15న ముంబైలో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ మూవీ ఒక్క ఫ్రేమ్ ని అయినా ఇంకా చిత్రీకరించకముందే డిజిటల్- శాటిలైట్ డీల్ ను ముగించే దిశగా ఉందని తెలిసింది.
మహమ్మారికి ముందు సల్మాన్ ఖాన్ `భారత్` శాటిలైట్ మరియు డిజిటల్ హక్కుల కోసం రూ. 130 కోట్లు సంపాదించాడు. అమెజాన్ - జీ చానెల్ తో సల్మాన్ ఒప్పందం కారణంగా దబాంగ్ 3 కూడా అదే రేంజ్ లో ఉంది. మహమ్మారి డిజిటల్ విండో రిలీజ్ టైమ్ కేవలం 4 వారాలకు తగ్గడంతో గేమ్ మారిపోయింది. సూర్యవంశీ పోస్ట్ రిలీజ్ స్ట్రీమింగ్ కోసం దాదాపు 140 కోట్లు పలికింది. ఇప్పుడు మరో సల్మాన్ చిత్రం 8 వారాల విండోతో అతిపెద్ద పోస్ట్ రిలీజ్ స్ట్రీమింగ్ డీల్ కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కభీ ఈద్ కబీ దీపావళి శాటిలైట్ డిజిటల్ హక్కుల కోసం సాజిద్ నడియాడ్‌వాలా రూ. 150 కోట్ల రేంజ్ లో ఆఫర్ లను అందుకున్నారు. బహుభాషల్లో స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ లతో సంభాషణలు జరుపుతున్నారు.. అని తెలుస్తోంది. కభీ ఈద్ కభీ దీపావళిలో పూజా హెగ్డే - వెంకటేష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈద్ 2023 విడుదలకు సిద్ధమవుతోంది.
ఒకసారి సంతకం చేస్తే ఇది సాంప్రదాయ విండోతో అన్ని కాలాలలో అతిపెద్ద నాన్-థియేట్రికల్ డీల్ అవుతుంది. కామిక్ ఎంటర్ టైనర్ అయినందున కభీ ఈద్ కభీ దీపావళి డిజిటల్ ప్రపంచం నుండి గొప్ప ఆఫర్ లను పొందింది. అక్షయ్ కుమార్ తో పాటు సల్మాన్ కి బుల్లితెర బిజినెస్ రేంజు బావుంది. తమ మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో మంచి టెలివిజన్ రేటింగ్ లను నిలకడగా సంపాదించుకున్న చలనచిత్రాల తారలుగా వీరికి పేరుంది. ఈ శైలి డిజిటల్ ప్లాట్ ఫారమ్ లకు కూడా గొప్ప డివిడెండ్ ను ఇస్తుందని విశ్లేషిస్తున్నారు.