ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి ఏడాదికి పైగా అయినా ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. దాంతో ఆమద్య ప్రభాస్ ఫ్యాన్స్ నిర్మాణ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ యూవీ క్రియేషన్ ను బ్యాన్ చేయాలంటూ ట్విట్టర్ లో ప్రచారం చేయడం జరిగింది. ఆ సమయంలో త్వరలోనే తప్పకుండా ఒక మంచి అప్ డేట్ తో మీ ముందుకు వస్తామంటూ హామీ ఇచ్చారు. కాని ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి అప్ డేట్ రాలేదు.
ఇప్పట్లో అప్ డేట్ వచ్చే అవకాశమే కనిపించడం లేదు. ఫ్యాన్స్ ఎంతగా డిమాండ్ చేస్తున్నా.. సోషల్ మీడియా ద్వారా ఒత్తిడి చేసే ప్రయత్నాలు చేస్తున్నా కూడా ప్రభాస్ అండ్ టీమ్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ ఇచ్చేందుకు సిద్దం అవ్వడం లేదు. అసు ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ పున: ప్రారంభం అయ్యేనా కూడా తెలియడం లేదు. దాంతో అప్ డేట్ ఇప్పట్లో రాకపోవచ్చు అంటున్నారు.
ఈ ఏడాదిలో సినిమా విడుదల చేయాలనుకున్నా కూడా విపత్తు కారణంగా షూటింగ్ జరగడం లేదు. యూరప్ లో షూటింగ్ జరగాల్సి ఉండగా అక్కడకు వెళ్లే అవకాశం లేదు. కనుక హైదరాబాద్ లోనే సెట్టింగ్ వేయాల్సి ఉంది. అందుకోసం కాస్త సమయం పట్టనుందట. షూటింగ్ ప్రారంభించి ఎప్పటికి పూర్తి చేస్తారో క్లారిటీ లేదు. అలాగే ఈ సినిమా ఫస్ట్ లుక్ విషయంలో కూడా క్లారిటీ లేదు. మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చి పోయే వరకు యూవీ క్రియేషన్స్ వారు ఇలాగే టైం పాస్ చేస్తారా అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.