బాహుబలిలో ఆ పాత్రే ఇష్టమంటున్న ప్రభాస్

Update: 2017-04-17 10:19 GMT
‘బాహుబలి’ సినిమాలో ‘బాహుబలి’ గానే కాక శివుడి పాత్రలోనూ కనిపించాడు ప్రభాస్. రెండు పాత్రలు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. తొలి భాగం చూసిన వాళ్లలో మెజారిటీ జనాలకు శివుడి పాత్ర.. అతను చేసిన విన్యాసాలే ఆకర్షించి ఉంటాయి. ఐతే అభిమానుల సంగతేమో కానీ.. ప్రభాస్ కు మాత్రం ‘బాహుబలి’లోని రెండు పాత్రల్లో టైటిల్ రోలే చాలా ఇష్టమంటాడు. రెండు పాత్రల్లో ఇదే క్లిష్టమైందని కూడా అతను చెప్పాడు.

‘‘శివుడి పాత్ర చేయడం కొంచెం ఈజీ అనే చెప్పాలి. అది అంతగా బాధ్యత లేని క్యారెక్టర్. ఏం చేసినా.. ఎలాంటి హావభావాలు ఇచ్చినా.. ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉన్నా పర్వాలేదు. కానీ రాజు పాత్రకు మాత్రం నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. దానికి కొన్ని పరిమితులున్నాయి. వాటిని ఫాలో కావాల్సి వచ్చింది. సటిల్ పెర్ఫామెన్స్ ఇవ్వాలి. గాంభీర్యం ప్రదర్శించాలి. మేం రెండు పాత్రల మధ్య వైరుధ్యం ఉండాలని భావించాం. దానికి తగ్గట్లే క్యారెక్టర్ల డిజైనింగ్ జరిగింది. నటన కూడా అందుకు తగ్గట్లే ఉంటుంది. బాడీ విషయంలో కూడా తేడా చూపించాను’’ అని ప్రభాస్ తెలిపాడు.

‘బాహుబలి’ గురించి తనకు తొలిసారి రాజమౌళి చెప్పినపుడే.. దాని స్కేల్ ఏంటన్నది తాను అంచనా వేయగలిగానని ప్రభాస్ తెలిపాడు. ‘‘మంచు పర్వాతల నుంచి వాటర్ ఫాల్ వచ్చే సీన్ గురించి నాకు రాజమౌళి చెబుతున్నపుడే ఆయన విజన్ ఏంటో.. ఈ సినిమా స్థాయి ఏంటో నాకు అర్థమైంది. ఈ సన్నివేశాన్ని నేను ఊహించుకున్న దాని కంటే బాగా తీశాడు రాజమౌళి. హాలీవుడ్ సినిమాల్లో కంటే బాగుంటుంది ఈ సీన్. ఇలాంటివి తీయడం ఆయనకు మాత్రమే సాధ్యం’’ అని ప్రభాస్ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News