మ‌హేష్‌ తో కుద‌ర‌ద‌ని ప్ర‌భాస్‌ ని క‌లిశారా?

Update: 2019-03-05 07:49 GMT
దాదాపు 800 మంది ఆర్టిస్టులు ఉన్న మూవీ ఆర్టిస్టుల సంఘం దేశంలోనే అతి పెద్ద అసోసియేష‌న్ అన‌డంలో సందేహ‌మే లేదు. టాలీవుడ్ లో అధికారికంగా రిజిస్ట‌ర్ అయిన ఆర్టిస్టుల సంఖ్య 800 మాత్ర‌మే అయినా వేలాది మంది ఆర్టిస్టులు నిత్యం ఉపాధిని - భృతిని టాలీవుడ్ నుంచి పొందుతున్నారు. వీళ్లంద‌రికీ ఓ స‌రైన వేదిక కావాల్సిన త‌రుణ‌మిదే. భార‌త‌దేశ వందేళ్ల సినీచ‌రిత్ర‌లో 88ఏళ్ల చ‌రిత్ర టాలీవుడ్ కి ఉన్నా ఇన్నేళ్ల‌లో ఆర్టిస్టుల కోసం సొంతంగా భ‌వంతి నిర్మించ‌క‌పోవ‌డం అన్న‌ది చాలా హాస్యాస్ప‌దం అన్న విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిసారీ మా సొంత బిల్డింగ్ క‌ట్టేస్తామంటూ ప‌లువురు డాంబికాల‌కు పోతున్నారే త‌ప్ప ఆ ప‌నిని కార్య‌చ‌ర‌ణ‌లో చేయ‌లేక‌పోయార‌న్న‌ది నిర్వివాదాంశం.

మా అసోసియేష‌న్‌ సొంత భ‌వంతి నిర్మాణం అన్న‌ది ఓ ప్ర‌హ‌స‌న‌మా? కోట్లాది రూపాయ‌ల పారితోషికాలు అందుకునే ఆర్టిస్టులు ఉన్న ఇండ‌స్ట్రీ ఇది. ల‌క్ష‌ల్లో పారితోషికాల్ని క్యార‌క్ట‌ర్ ఆర్టిస్టులే దండుకుంటారు. చందాలు వేసుకున్నా సొంత భ‌వంతి క‌ష్ట‌మేమీ కాదు. కానీ అలాంటి చోట‌ సొంత భ‌వంతి నిర్మించుకపోవ‌డం అన్న‌ది ఓ పెద్ద కామెడీ షో అన‌డంలో సందేహ‌మే లేదు. అయితే ఈ స‌న్నివేశం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌న‌డంలో అనుమానం లేదు. ఇటీవ‌ల మా అధ్య‌క్షుడు శివాజీ రాజా ఈ విష‌యాన్ని ప‌దే ప‌దే ప్ర‌స్థావిస్తున్నారు. అయితే మార్చి 10న `మా` ఎన్నిక‌ల త‌ర్వాత కొత్త కార్య‌వ‌ర్గం పాల‌న‌లోకి వ‌స్తుంది. ఇప్ప‌టికే ఎన్నిక‌ల వేడి పీక్స్ లో రాజుకుంది.

శివాజీరాజా- న‌రేష్ ప్యానెల్స్ మ‌ధ్య పోటాపోటీ ఉంద‌ని అర్థ‌మైంది. గెలిచి అధ్య‌క్షుడైన కొత్త నాయ‌కుడు అయినా మా సొంత భ‌వంతి నిర్మాణం కోసం కృషి చేస్తారా.. లేదా? అన్న‌దే పాయింట్. అయితే ఇటీవ‌లే త‌న బ‌ర్త్ డే వేడుక‌ల సంద‌ర్భంగా త‌న ప్యానెల్ ని ప్ర‌క‌టిస్తూ.. శివాజీరాజా త్వ‌ర‌లో విదేశాల్లో చేప‌ట్టబోయే నిధి సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం గురించి రివీల్ చేశారు. ఏప్రిల్ లో ఓ భారీ నిధి సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌భాస్ ముఖ్య అతిధిగా విచ్చేస్తార‌ని తెలుస్తోంది. ప్ర‌భాస్ - నాగార్జున‌ - వెంకీ త‌దిత‌రుల‌తో కార్య‌క్ర‌మం ప్లాన్ చేశామ‌ని `మా` ఇదివ‌ర‌కూ వెల్ల‌డించింది. అయితే ప్ర‌స్తుతం ఎన్నిక‌ల్లో గెలిచే అధ్య‌క్షుడు ఈ కార్య‌క్ర‌మం చేయాల్సి ఉంటుంది. ఎవ‌రు గెలిచినా ప్ర‌భాస్ స‌హా స్టార్ల‌తో భారీ నిధి సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. మ‌హేష్ త‌ర్వాత అంత‌టి ఛ‌రిష్మా ఉన్న స్టార్ గా ప్ర‌భాస్ పేరు వ‌ర‌ల్డ్ వైడ్ పాపుల‌ర్. అందుకే ఈ ఈవెంట్ పై అంద‌రికి ఆస‌క్తి ఉంది. సాహో - జాన్ చిత్రాల‌తో బిజీగా ఉన్న ప్ర‌భాస్ త‌న కాల్షీట్ల‌ను ఈ ఈవెంట్ కోసం స‌ర్ధుబాటు చేయాల్సి ఉంటుంది.ఇక మ‌హేష్ తో చేయాల్సిన ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది కాబ‌ట్టే శివాజీ రాజా బృందం ప్ర‌భాస్ ని సంప్ర‌దించారా? అంటూ ఆస‌క్తిగా చ‌ర్చ సాగుతోంది. కొన్నిటికి కాల‌మే స‌మాధానం చెబుతుంది. కాస్త‌ వేచి చూడాల్సిందే.
   

Tags:    

Similar News