ఇంతవరకు ఇండియన్ సినిమాలో ఏ హీరో చేయని విధంగా ఒక హీరో ఒక కథ కోసం ఐదేళ్లు కష్టపడ్డాడు అంటే అది ప్రభాస్ ఒక్కరే అన్న విషయం అందరికి తెలిసిందే. ఐదేళ్లు బాహుబలి సినిమాకోసం కష్టపడాలి అందుకు తగిన ఫలితాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా స్టార్ హోదాను సంపాదించుకున్నాడు. అంతే కాకుండా బాహుబలి ఏ స్థాయిలో కలెక్షన్స్ ని అందుకుందో తెలిసిన విషయమే.
అయితే ప్రభాస్ కి బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ వచ్చింది. రీసెంట్ గా బాహుబలి సెకండ్ పార్ట్ బుల్లితెర లో ప్రసారం అయినప్పుడు రికార్డ్ స్థాయిలో రేటింగ్ వచ్చింది. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ ని బాలీవుడ్ లో డైరెక్ట్ గా కరణ్ జోహార్ దింపుదామని అనుకున్నాడు. తన ధర్మ ప్రొడక్షన్ లో ఒక మంచి సినిమా ద్వారా ప్రభాస్ ని చూపించాలని అనుకున్నాడు. కానీ ఆ ఛాన్స్ ఇప్పుడు ప్రభాస్ మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం ప్రభాస్ అత్యధిక రెమ్యునరేషన్ ని అడగడమే అని తెలుస్తోంది.
బాహుబలి సినిమా అంటే జక్కన్న భారీ బడ్జెట్ సినిమా కాబట్టి రెమ్యునరేషన్ ని కాస్త గట్టిగానే అందుకున్నాడు. కానీ ప్రతి సినిమా అలా ఉండదు. సోలో గా ఎంట్రీ ఇస్తే స్టామినా తెలుస్తోంది. అయితే కరణ్ జోహార్ కూడా అలా అలోచించి 10 కోట్ల వరకు అఫర్ చేస్తే.. 20 కోట్లు కావాలంటూ ప్రభాస్ ఒప్పుకోక పోవడం వలన ఛాన్స్ మిస్ అయినట్లు తెలుస్తోంది.