ఆచార్య సెట్ లోనే ప్రభాస్ సినిమా.. కానీ!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే పలు సినిమాలు ప్రకటించినా... అవి మాత్రం ఇంకా రిలీజ్ కావడం లేదు. గత ఏడాది రాధే శ్యాం సినిమాతో వచ్చిన ప్రభాస్.. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నారు.
మారుతి ప్రభాస్ సినిమా షూటింగ్ ఈ నెలలో 18న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ఒక రోజు ఆలస్యంగా ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. అంటే ఫిబ్రవరి 19 నుంచి ప్రభాస్ మారుతి మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా షూటింగ్ కొరటాల శివ ఆచార్య కోసం వేసిన సెట్ లో జరుగుతుంది అని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ సెట్ ను కాస్త మార్పులు చేసినట్లు సమాచారం.
ఇందులో షూటింగ్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ లో టాక్. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టు కోసం ప్రభాస్ 52 రోజులు కాల్ షీట్లు ఇచ్చాడట.
ఇక ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తి అయింది. ఈ చిత్రంలో ప్రభాస్ ను ఓ ఆత్మ ఆవహించి చేసే పనులు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. విఎఫ్ఎక్స్ వర్క్ కు ఈ సినిమాలో ఎక్కువ స్కోప్ ఉంటుందని సమాచారం. ఇక ఇటీవల షూటింగ్ లో ప్రభాస్ అత్యంత ఖరీదైన లంబోర్గిని కారును మారుతి డ్రైవ్ చేస్తూ కనిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
ఇక ప్రభాస్ సరైన హిట్టు కొట్టాలని అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభాస్ ఆది పురుష్ సినిమా జూన్ 16వ తేదీన విడుదల అయ్యేందుకు అంతా సిద్ధమైంది. మరోవైపు ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా కూడా సెప్టెంబర్ 28వ తేదీన విడుదల అయ్యేందుకు అంతా సిద్ధమైంది. ఈ రెండు సినిమాలతో మళ్లీ ప్రభాస్ ఫాంలోకి వస్తాడని ఆశిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.