ప్రభాస్‌ మూడవ ప్రాజెక్ట్‌ కూడా కన్ఫర్మ్‌!

Update: 2020-10-08 13:30 GMT
ప్రభాస్‌ ప్రస్తుతం రాధేశ్యామ్‌ సినిమాను చేస్తున్నాడు. గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు వెయిట్‌ చేస్తున్నారు. సాహో విడుదలకు ముందే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. కాని ఏవో కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ ఏడాదిలో సినిమా ఎలాగైనా వస్తుంది అనుకుంటే కరోనా కారణంగా సినిమా షూటింగ్‌ ఆరు నెలల పాటు నిలిచి పోయి ఇటీవలే పునః ప్రారంభం అయ్యింది. ఒక వైపు రాధాకృష్ణ అలా వాయిదాలు పడుతూ వస్తున్నా కూడా రెండు సినిమాలకు ఓకే చెప్పాడు.. వాటికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఒక సినిమాలో ప్రభాస్‌ నటించనుండగా బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో 'ఆదిపురుష్‌' లో వచ్చే ఏడాదిలో నటించబోతున్నాడు. ఈ రెండు సినిమాలు ఇంకా ప్రారంభం కూడా అవ్వకుండానే తదుపరి సినిమా కు సంబంధించిన చర్చలు కూడా ప్రభాస్‌ టీం జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌ లో రాధేశ్యామ్‌ చేస్తున్న ప్రభాస్‌ నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో సినిమాను మరియు ఆదిపురుష్‌ సినిమాను ఇతర నిర్మాణ సంస్థల్లో చేస్తున్నాడు. ఆ రెండు సినిమాల తర్వాత మళ్లీ తన హోం బ్యానర్‌ అయిన యూవీ క్రియూషన్స్‌ లోనే చేయబోతున్నాడట.

యూవీ క్రియూషన్స్‌ బ్యానర్‌ లో కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ మూవీ ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమాను చేస్తున్న ప్రశాంత్‌ నీల్‌ వచ్చే ఏడాదిలో ఎన్టీఆర్‌ తో సినిమా చేసే అవకాశం ఉంది. 2022లో ప్రభాస్‌ తో కేజీఎఫ్‌ స్టార్‌ ప్రశాంత్‌ నీల్‌ మూవీ ఉంటుందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. త్వరలోనే ఆ విషయమై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకే సారి మూడు సినిమాలు కమిట్‌ అయ్య ఉన్న ప్రభాస్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలున్నాయి.
Tags:    

Similar News