రజనీ- శంకర్ కాంబోతో 2.0 తర్వాత మళ్లీ `సాహో` లాంటి భారీ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు నైజాం-వైజాగ్ ఏరియాలో రిలీజ్ చేశారు. ఈ సినిమా వల్ల అతడికి లాభమా నష్టమా? ఎంత రికవరీ అయ్యింది? అన్నది పరిశీలిస్తే ఇంట్రెస్టింగ్ విషయాలే తెలిశాయి.
ఇప్పటికి నైజాం 27.5 కోట్లు వసూలైందని ప్రకటించారు. వైజాగ్ 10కోట్లు వసూలైంది. మొత్తం 37.5కోట్లు షేర్ సుమారుగా వసూలు చేసింది. అయితే `సాహో` నైజాం- వైజాగ్ ఏరియా కలుపుకుని థియేట్రికల్ రైట్స్ ను దిల్ రాజు రూ. 45 కోట్లకు సొంతం చేసుకున్నారు. అంటే.. ఇంకో 8కోట్లు సుమారుగా రాబట్టాల్సి ఉంది. రెండో వారం మూడో వారం ఆడితే రూ.8 కోట్లు వస్తుందా? అన్నది ఇప్పటికి ఫజిల్.
ఇంతకుముందు యువి క్రియేషన్స్ - ఎన్వీ ప్రసాద్ లతో కలిసి 2.0 హక్కులు దక్కించుకుని రిలీజ్ చేస్తే ఆ చిత్రానికి గాను స్వల్ప నష్టాలు వచ్చాయన్న టాక్ వచ్చింది. మరి ఇప్పుడు అలాంటి ఫలితమే ఎదురవుతోందా? లేక రెండో వారం మూడో వారం సాహో బాగా ఆడి మొత్తం రికవరీ చేస్తుందా? అన్నది చూడాలి. మిశ్రమ స్పందనలు వచ్చినా 30 కోట్లకు పైగా ఆ రెండు ఏరియాలు కలుపుకుని వసూలు చేసిందంటే ఆషామాషీనా? పదిరోజుల్లో నైజాం నుంచి 27 కోట్ల షేర్ వసూళ్లు అంటే మామూలు విషయమా? ఇవి బిగ్ రేంజ్ రిటర్న్స్ అనే చెప్పాలి. ఫిగర్స్ ని ఎగ్జాగరేట్ చేసి చెప్పకపోతే ఒక రకంగా మంచి ఫలితమే.