డార్లింగ్ ప్రభాస్ నటించిన `బాహుబలి- ది కన్ క్లూజన్` 2017 ఏప్రిల్ లో రిలీజైంది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా రిలీజ్ బరిలోకి రావడానికి ఇప్పటికే రెండేళ్లు దాటింది. అయితే ఒక స్టార్ హీరో సినిమా కోసం అభిమానులు అంత ఓపిగ్గా ఎదురు చూడడం అన్నది అరుదు. అది ఒక్క డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రమే సాధ్యం. అప్పటికీ సాహో కోసం ఎంతో ఓపిగ్గా వేచి చూశారు. అందుకేనేమో డార్లింగ్ ప్రభాస్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. నిన్న ముంబైలో `సాహో` ట్రైలర్ లాంచ్ చేసిన అనంతరం ప్రత్యేకంగా మీడియా మీట్ లో డార్లింగ్ కొన్ని విషయాలపై స్పష్టంగా మనసు విప్పి మాట్లాడారు.
అందులో హైలైట్స్ పరిశీలిస్తే...`` వాస్తవానికి `సాహో` కోసం రెండేళ్లు కేటాయించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు బాహుబలికి దాదాపు నాలుగేళ్లు పట్టింది. సాహో భారీ యాక్షన్ సన్నివేశాల కోసమే ఏడాది పట్టింది. ముఖ్యంగా అబుదాబిలో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాల కోసం చాలా సమయం వెచ్చించాం. యాక్షన్ సన్నివేశాల కోసం చాలా ప్రిపేర్ కావాల్సి వచ్చింది. రిహార్సల్స్ చేశాం. అందువల్ల సినిమా పూర్తవ్వడానికి రెండేళ్లు కేటాయించాల్సి వచ్చింది`` అని అన్నారు. అలాగే సాహో చిత్రాన్ని బాలీవుడ్ వెర్షన్ కోసం స్వయంగా డబ్బింగ్ చెప్పానని ప్రభాస్ తెలిపారు. `ఆ వాయిస్ నాదే. నిజానికి నాకు హిందీ రాయడం చదవడం వచ్చు కానీ మాట్లాడడం రాదు. ఏదోలా డైలాగ్స్ చెప్పాను. డబ్బింగ్ మ్యానేజ్ చేసేశాను`` అని తెలిపారు. హిందీ మాట్లాడేందుకు చాలానే కష్టపడాల్సి వచ్చిందని అన్నారు.
తదుపరి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. కె.కె. రాధాకృష్ణ దర్శకత్వంలోని చిత్రం ఇప్పటికే 20 రోజులు షూటింగ్ పూర్తయిందని వెల్లడించారు. సినిమాల పరంగా స్పీడ పెంచుతారా? అన్న ప్రశ్నకు.. ఇకమీదట ఏడాదికి రెండు సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. సాహో చిత్రం తెలుగు- తమిళ్-హిందీ భాషల్లో ఈ నెల 30న అత్యంత భారీగా విడుదలవుతోంది. సుజీత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు 300కోట్ల బడ్జెట్ తో నిర్మించింది.