బాహుబలి తో దేశవ్యాప్త గుర్తింపు సాధించిన ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ 'సాహో' లో నటిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగు హిందీ భాషలలో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. తమిళ.. మలయాళం భాషలలోకి ఈ సినిమాను డబ్బింగ్ చేస్తారు. ఇదిలా ఉంటే హిందీ వెర్షన్ కు ప్రభాస్ స్వయంగా డబ్బింగ్ చెప్పుకునే ఆలోచనలో ఉన్నాడని గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ప్రభాస్ ధృవీకరించాడు.
ప్రభాస్ కి హిందీ కొంచెం కొంచెమే తెలుసు. డబ్బింగ్ చెప్పుకునేంత ప్రావీణ్యం లేదు. అందుకే 'బాహుబలి' రెండు భాగాలకు ప్రభాస్ కు హిందీలో శరద్ కేల్కర్ డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే 'బాహుబలి' తర్వాత హిందీపై దృష్టిపెట్టిన ప్రభాస్ ఒక స్పెషల్ ట్రైనర్ ను నియమించుకున్నాడట. అ ట్రైనర్ పేరు సోని. ఆవిడ ప్రభాస్ కు నెలకు పైగా డైలాగ్ క్లాసులు నిర్వహించిందట. దీంతో ప్రభాస్ డబ్బింగ్ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నాడని సమాచారం.
'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించే చిత్రం కావడంతో హిందీ ఆడియన్స్ లో 'సాహో' పై భారీ క్రేజ్ ఉంది. దానికి తగ్గట్టే వేలాది స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు 'సాహో' మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. హిందీలో మాత్రమే దాదాపు 5000 స్క్రీన్స్ లో 'సాహో' రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ ఏడాది ఆగస్ట్ 15 న సాహో రిలీజ్ కానుంది. ఈ సినిమా కనుక క్లిక్ అయితే బాలీవుడ్ లో మన డార్లింగ్ పాతుకుపోవడం ఖాయమే.