డార్లింగ్ హీరో ప్రభాస్ సాహో కోసం అభిమానుల ఎదురుచూపుల గురించి మాటల్లో వర్ణించడం కష్టం. బాహుబలి వచ్చి రెండేళ్లు అవుతున్నా తమ హీరో కొత్త సినిమా ఎప్పుడెప్పుడా అని కళ్ళలో వత్తులు వేసుకుని ఉన్నారు. ఇప్పడకే అధిక శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సాహో మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసింది. ఆగస్ట్ 15 ఖచ్చితంగా విడుదలవుతుందా లేదా అనే క్లారిటీ లేదు కానీ యూనిట్ మాత్రం కాన్ఫిడెంట్ గా అదే డేట్ కి కట్టుబడి ఉందని సమాచారం.
ఇదిలా ఉండగా ప్రభాస్ మెల్లగా జాతీయ మీడియాకు సాహో ప్రమోషన్ కోసం అందుబాటులోకి వస్తున్నాడు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన విశేషాలు షేర్ చేసుకుంటున్నాడు. సాహో కోసం ప్రభాస్ మొదటి సారి హిందీ డబ్బింగ్ స్వయంగా చెప్పబోతున్నాడు. దీని కోసం సోనీ అనే టీచర్ నెలరోజుల పాటు ఏకధాటిగా ట్యూషన్ చెప్పిందట. మొదటి షెడ్యూల్ కొంచెం కష్టంగా అనిపించినా తర్వాత అలవాటు అయ్యాక ఈజీగా అనిపించిందని చెప్పాడు.
ఆ నమ్మకం కుదిరాకే స్వంతంగా డబ్బింగ్ చెప్పాలనే నిర్ణయం తీసుకున్నాడట. నిజానికి చిరంజీవి నాగార్జున వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు స్ట్రెయిట్ గా హిందీ సినిమాలు చేసినా డబ్బింగ్ మాత్రం చెప్పే సాహసం చేయలేకపోయారు. కానీ ప్రభాస్ ఇంత ధైర్యంగా రెడీ అన్నాడంటే బాగానే ప్రిపేర్ అయినట్టే. రిలీజ్ డేట్ ఒక్కటి కన్ఫర్మ్ అయ్యిందంటే దాన్ని బట్టి సంబరాలకు రెడీ అవుతారు.