ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి సక్సెస్ ఇచ్చిన కిక్కుని ఆస్వాధిస్తున్నాడు. పనిలో పనిగా తనకి వచ్చిన ఈ గుర్తింపును ఇప్పుడే తెలివిగా క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకే అతడు యూరప్ ట్రిప్ వెళ్లాల్సినది క్యాన్సిల్ చేసుకుని మరీ ఇతరత్రా పనులు పెట్టుకున్నాడు. ఇటీవలే మీడియాకి ఓ పార్టీ ఎరేంజ్ చేశాడు. ఆ తర్వాత ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్ని చుట్టేస్తున్నాడు.
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ప్రధాని మోడీ వంటివారిని కలిసి బాహుబలి చూడాల్సిందిగా ప్రత్యేక షో ఏర్పాట్లు చేశాడు. పెదనాన్న కృష్ణంరాజు సహా ఢిల్లీలో పాగా వేసి తనకి కావాల్సిన ఔట్ పుట్ తీసుకుంటున్నాడు. రెబల్ స్టార్ దగ్గరుండి మరీ బిజేపీ ప్రముఖులందరికీ ప్రభాస్ ని పరిచయం చేస్తున్నాడు. సరైన టైమింగుతో సరైన ప్రణాళికతో మూవ్ అవుతున్నారు.
అంతేనా పనిలో పనిగా ప్రభాస్ బాలీవుడ్ లో స్నేహితుల్ని కలిసి చీరప్ చేస్తున్నాడు. నిన్ననే హీరో అజయ్ దేవగన్ ని కలిశాడు. అజయ్ ఎప్పట్నుంచో మంచి స్నేహితుడు. అయితే ఢిల్లీలో తను ఉంటున్న హోటల్ లోనే అజయ్‌దేవగన్ కూడా ఉంటున్నాడని తెలుసుకుని తనని నేరుగా వెళ్లి కలిశాడు. అప్పటికే అజయ్ 'బాహుబలి' చూశారు. ప్రభాస్ ని మెచ్చుకున్నారు. అందుకు ప్రతిగా త్వరలో రిలీజ్ కి రాబోతున్న 'దృశ్యం' చూస్తానని ప్రభాస్ మాటిచ్చాడు. అదీ సంగతి.