'మిర్చి' సినిమాతో ప్రొడక్షన్ లోకి దిగిన యూవీ క్రియేషన్స్ టీమ్.. మంచి అభిరుచి గల నిర్మాతలు అనిపించుకున్నారు. ఓవైపు పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తూనే.. మరోవైపు మీడియం బడ్జెట్ చిత్రాలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో 'యూవీ కాన్సెప్ట్స్' అనే అనుబంధ సంస్థను ఏర్పాటు చిన్న సినిమాలను నిర్మించడం మొదలుపెట్టారు. ఇటీవల ఈ బ్యానర్ పై 'ఏక్ మినీ కథ' అనే మినీ చిత్రాన్ని తెరకెక్కించి అటు లాభాన్ని ఇటు పేరుని సంపాదించారు. ఇప్పుడు యూవీ క్రియేషన్స్ వారి కాన్సన్ట్రేషన్ మొత్తం 'రాధే శ్యామ్' మీద ఉంచారని తెలుస్తోంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ లవ్ స్టోరీ ''రాధే శ్యామ్''. టీ సిరీస్ - గీతా కృష్ణ సహకారంతో యూవీ బృందం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతి పనీ ప్రభాస్ - రాధాకృష్ణ ఇద్దరూ చూసుకుంటున్నారట. 'సాహో' సినిమా ఆశించిన స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టకపోవడంతో.. ఈసారి తన స్నేహితులు, హితులైన యూవీ ప్రొడక్షన్స్ వారికి ఎలాగైనా ఓ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ప్రభాస్ గట్టిగా ఫిక్స్ అయ్యారట. అందుకే అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటున్నారట.
ఇకపోతే పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న 'రాధే శ్యామ్' చిత్రం ఫైనల్ స్టేజికి వచ్చేసింది. కేవలం పది రోజల షూటింగ్ చేస్తే సినిమా మొత్తం పూర్తైపోతుంది. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ రానుందని ఇటీవల 'రాధే శ్యామ్' హిందీ వెర్షన్ మ్యూజిక్ డైరెక్టర్ మనన్ భరద్వాజ్ తెలిపారు.