కరణ్ జోహార్ తఖ్త్ కు నో అన్న ప్రభాస్

Update: 2018-08-22 16:47 GMT
స్టార్ కావడానికి ఒక హీరోకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అంటే ఎవరు కూడా ఖచ్చితంగా చెప్పలేరు.  అందం ఉన్న స్టార్ హీరో కావొచ్చు..పెద్దగా లేకపోయినా కావొచ్చు. యాక్టింగ్ వచ్చి ఉండాలనే రూల్ కూడా లేదు. ఎదో మ్యానేజ్ చేసి కూడా స్టార్ అయిన వాళ్ళు ఉన్నారు.  ఇలాంటివి ఎన్నున్నా ఒక విషయం మాత్రం చాలా కీలకం. అదే స్టొరీ సెలెక్షన్!  ఆ విషయం ఒక్కటి తెలిస్తే..  కనీసం లక్కీగా అయినా వాటిని చూజ్ చేసుకుంటే ఇక పనయిపోయినట్టే.  కానీ కొన్నిసార్లు ఆ నిర్ణయాలు ఎలా ఉంటాయి అంటే ఫలితం వచ్చే వరకూ తెలీదు అది కరెక్టా కాదా అని!

ఇక డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్దాం.  'బాహుబలి' చేయకమునుపే ప్రభాస్ తెలుగులో పెద్ద స్టార్.  టాప్ లీగ్ స్టార్.  మరి 'బాహుబలి' లాంటి సినిమాకు సైన్ చేయడం పెద్ద రిస్కే.. ఎంత పెద్ద రిస్క్ అంటే.. సినిమా ఫ్లాప్ అయితే అందరూ నవ్వేవాళ్ళు.. స్టార్ హీరో అయి ఉండి నాలుగైదేళ్ళు ఎవరైనా ఒక ప్రాజెక్ట్ పై పని చేస్తారా అంటూ గేలిచేసి ఉండేవాళ్ళు కూడా. కానీ.. ప్రభాస్ డెసిషన్ కరెక్ట్ అయింది.  తనకు 'ఛత్రపతి' లాంటి మెమొరబుల్ ఫిలిం ఇచ్చిన రాజమౌళి మీద పెట్టుకున్న నమ్మకం నిజమైంది. నేషనల్ లెవెల్ స్టార్ అయ్యాడు. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు అందరూ రాజమౌళి మాత్రమే సూపర్ అన్నారు గానీ.. ఒక్కసారి 'ది కంక్లూజన్' రిలీజ్ అయ్యాక పరిస్థితి మారిపోయింది.  అందరూ ప్రభాస్ హార్డ్ వర్క్ - డెడికేషన్ - నటన గురించి మాట్లాడడం మొదలు పెట్టారు.

తాజా సమాచారం ప్రకారం, కరణ్ జోహార్ సినిమా 'తఖ్త్' లో సెకండ్ లీడ్ ఆఫర్ ను ప్రభాస్ సున్నితంగా తిరస్కరించాడట.  భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ పీరియడ్ ఫిలిం లో రణవీర్ సింగ్ మెయిన్ హీరో.  ప్రభాస్ కు సెకండ్ లీడ్ పాత్ర ఆఫర్ చేస్తే 'నో' చెప్పాడట.   ఈ పాత్ర ప్రభాస్ తో పాటుగా రణబీర్ కపూర్ - టైగర్ ష్రాఫ్ లు కూడా తిరస్కరించారని సమాచారం.  దాంతో 'సంజు' సినిమాలో రణబీర్ కపూర్ ఫ్రెండ్ పాత్రలో నటించిన విక్కీ కౌశల్ కు వెళ్లిందట.   సో.. ఈ డెసిషన్ కరెక్టా కాదా అనే విషయం సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు. 
Tags:    

Similar News