సంతోష్ ను చూస్తే ప్రభాస్ కృతజ్ఞత గుర్తొస్తుంది

Update: 2021-10-30 03:49 GMT
ఇండస్ట్రీలో ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లలో మారుతి ఒకరు. త్రివిక్రమ్ .. కొరటాల .. అనిల్ రావిపూడి మాదిరిగా ఆయన తన సినిమాలకి తానే కథా .. స్క్రీన్ ప్లే .. మాటలు రాసుకుంటాడు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ .. సమపాళ్లలో ఉండేలా చూసుకుంటూ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడానికి తనవంతు ప్రయత్నం చేస్తుంటాడు. క్రిష్ 'హరిహర వీరమల్లు'ను సెట్స్ పై ఉంచి ఎలా 'కొండ పొలం' చేశాడో, అలాగే మారుతి కూడా 'పక్కా కమర్షియల్' సెట్స్ పై ఉండగానే 'మంచి రోజులు వచ్చాయి' చేశారు.

నిన్న రాత్రి జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడాడు. 'మంచిరోజులు వచ్చాయి' సినిమా చేయడానికి అవసరమైన ఎనర్జీ నాకు 'పక్కా కమర్షియల్' సినిమా నుంచి వచ్చింది. ఆ సినిమాలో హీరో మా గోపీచంద్. అన్నతో పనిచేస్తున్నట్టుగా తెలియలేదు. ప్రతి రోజూ ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాను. నేను ఏ సినిమానైతే ఎంజాయ్ చేస్తూ చేశానో .. ఆ సినిమా ఎప్పుడూ మిస్ ఫైర్ కాలేదు. అలా నేను సెట్లో ఎంజాయ్ చేసిన సినిమా 'పక్కా కమర్షియల్'. ఆ సినిమా మీకు డబుల్ ఇంపాక్ట్ ఇస్తుంది .. ఆ కాన్ఫిడెన్స్ ను నేను ఇస్తాను.

సంతోష్ విషయానికి వస్తే .. ఒక కృతజ్ఞత అనేది ఎంత దూరం తీసుకువస్తుందనేది నాకు సంతోష్ ను చూస్తే అనిపిస్తుంది. ఎందుకంటే 'వర్షం' అనే సినిమా వలన ప్రభాస్ కి ఒక మంచి హిట్ ఇచ్చిన సంతోష్ వాళ్ల ఫాదర్ అకాల మరణం చెందారు. అప్పుడు సంతోష్ వాళ్ల కోసం వాళ్ల మదర్ చాలా కష్టపడ్డారు. సంతోష్ ఇండస్ట్రీలో ట్రై చేస్తూ ఉన్నప్పుడు, ఆయనలో చిన్న మేజిక్ ఉంది అనే విషయాన్ని యూవీ బ్యానర్ వారు గుర్తించారు. అతను తనకి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కొడుకు అనే ఒక కృతజ్ఞత ఎక్కడో ఉండి అతణ్ణి పిక్ చేసి, వాళ్ల నాన్న రుణం తీర్చుకోవడం .. వాళ్ల బ్యానర్లో సినిమాలు చేయడమనేది .. యూవీ బ్యానర్ కే చెల్లుతుంది.

ఎందుకంటే చాలామంది వాడుకుని వెళ్లిపోతారు ఇక్కడ .. నేను చూశాను. వంశీ .. విక్కీ .. ప్రమోద్ .. ప్రభాస్ .. వీళ్లంతా కూడా మనం ఒక రూపాయి ఇస్తే .. వంద రూపాయలు తిరిగి ఇచ్చేస్తారు. ఒక్క రూపాయి కూడా వాళ్లు రుణం ఉంచుకోరు. అలాంటి పర్సన్స్ వాళ్లు. అంత మంచి వాళ్లు నాకు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థ్యాంక్స్ చెబుతున్నాను" అంటూ ముగించాడు.


Tags:    

Similar News