2019 మోస్ట్ అవైటెడ్ మూవీస్ జాబితాలో నంబర్ వన్ క్రేజుతో వెలిగిపోతోంది `సాహో`. బాహుబలి ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమాగా `సాహో` చిత్రానికి వచ్చిన క్రేజు అంతా ఇంతా కాదు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ రాకకోసం ప్రపంచం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తోంది. ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్- కోలీవుడ్- మాలీవుడ్- శాండల్వుడ్ లోనూ భారీ అంచనాల నడుమ బాక్సాఫీస్ వార్ కి తెరతీయబోతున్న మూవీ ఇది. అందుకే యువి క్రియేషన్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేసేందుకు సన్నాహకాల్లో ఉంది. ఆగస్టు 15న రిలీజ్ కాబట్టి అంతకంటే ముందే ప్రచారంలో వేగం పెంచేందుకు తెలివైన ఎత్తుగడలు వేస్తోంది. ఇక సాహో టీజర్ ని ఈద్ కానుకగా జూన్ 5న అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతున్న సల్మాన్- `భారత్` సినిమాతో రిలీజ్ చేస్తోంది కాబట్టి హిందీలో ప్రచారం మొదలైనట్టే. తెలుగు- తమిళంలోనూ ప్రచారం పరంగా దూసుకుపోయే ప్లాన్ రెడీ గా ఉందిట.
అదంతా సరే.. బాహుబలి తర్వాత అంతే క్రేజీగా రిలీజవుతున్న సాహో చిత్రానికి పోటీ లేదా? అంటే .. ఇరుగు పొరుగు భాషల్లో పలు భారీ చిత్రాల వల్ల పోటీ ఉందనే అర్థమవుతోంది. సరిగ్గా ఆగస్టులో డజను పైగా చిత్రాలు తెలుగు- తమిళ్- హిందీ- మలయాళం బెల్ట్ లో రిలీజవుతున్నాయి. అది కూడా పలువురు క్రేజీ హీరోలు నటించినవి కావడంతో ఆ మేరకు సాహోకి పోటీ తప్పదు. హిందీలో కిలాడీ అక్షయ్ కుమార్ నటించిన భారీ మల్టీస్టారర్ `మిషన్ మంగళ్` ఆగస్టు 9న రిలీజ్ కానుంది. అంటే సాహో కంటే ఆరు రోజుల ముందు రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి సాహో రిలీజ్ తేదీ ఆగస్టు 15 కాబట్టి ఈ సర్ధుబాటు చేశారన్న టాక్ వినిపిస్తోంది. అక్షయ్ కుమార్ - విద్యాబాలన్ - తాప్సీ పన్ను- సోనాక్షి సిన్హా- నిత్యా మీనన్ - కీర్తి కుల్హారి - షర్మాన్ జోషి వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రానికి ప్యాడ్ మ్యాన్ ఫేం ఆర్.బాల్కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఆగస్టు 15న ప్రభాస్ సాహో.. జాన్ అబ్రహాం `బట్లా హౌస్` చిత్రాలు ఒకేరోజు రిలీజవుతున్నాయి కాబట్టి అక్షయ్ తన సినిమాని ప్రీపోన్ చేశాడని చెబుతున్నారు. ఇక ఆగస్టు చివరిలో సుశాంత్ సింగ్ - శ్రద్ధా కపూర్ నటించిన చిచ్చోర్ రిలీజవుతోంది.
కేవలం ఇవే కావు. ఆగస్టులో ఇరుగు పొరుగు భాషల్లో భారీ చిత్రాల రిలీజవుతున్నాయి. తమిళంలో విక్రమ్ నటిస్తున్న భారీ చిత్రం `కరికాలన్` ఆగస్టులోనే రిలీజ్ కానుంది. అలాగే అజిత్ నటిస్తున్న `నెర్కొండ పారవై` మాధవన్ సినిమా `రాకెట్రి` (రాకెట్ సైంటిస్ట్ తంబి నారాయణన్) చిత్రాలు ఆగస్టులోనే రిలీజ్ కానున్నాయి. ధృవ విలన్ అరవింద స్వామి నరగసూరన్ (నరకాసురుడు) ఆగస్టు 14న రిలీజవుతుందని చెబుతున్నారు. అటు మలయాళంలోనూ మమ్ముట్టి నటించిన గానగంధర్వన్, పృథ్వీరాజ్ నటించిన మైథలాజికల్ మూవీ `కాళియాన్` వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. కన్నడం లో శివరాజ్ కుమార్ నటించిన `అన్న తమ్మండిరు` అనే భారీ చిత్రం రిలీజ్ కి రానుంది. అంటే అన్ని భాషల్లో ఆ మేరకు సాహో`ని ఇవన్నీ రౌండప్ చేశాయనే భావించాలి. ఆగస్టు 15 తేదీకి కాస్త అటూ ఇటూగా రిలీజవుతున్న చిత్రాలు ఇవన్నీ. అంటే ఆ మేరకు సాహోకి పోటీ ఉందనే అర్థం. టిప్పర్ లారీ ఎల్లి స్కూటర్ ని గుద్దేస్తుందా.. స్కూటరే వచ్చి లారీనే గుద్దేస్తుందా! అన్నది డార్లింగే తేల్చాల్సి ఉంది.