2019 ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా `సాహో` పేరు మార్మోగిపోతోంది. డార్లింగ్ ప్రభాస్ `బాహుబలి` సిరీస్ తర్వాత నటిస్తున్న సినిమాగా బిజినెస్ వర్గాల్లోనూ అసాధారణ క్రేజు నెలకొంది. అందుకు తగ్గట్టే బాహుబలి బడ్జెట్ ని కొట్టే రేంజులో అసాధారణ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు - మేకింగ్ వీడియో - టీజర్ ప్రతిదీ సినిమాపై ఉత్కంఠ పెంచాయి. ప్రభాస్ ఈసారి అసాధారణమైన యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడని అర్థమైంది.
రామోజీ ఫిలింసిటీ - దుబాయ్ - అబుదబీ సహా పలు చోట్ల ఇప్పటికే కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని తెరకెక్కించారు. హిందీ డీల్ పెద్ద స్థాయిలో జరగడంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల బిజినెస్ సహా రకరకాల విషయాలపై ఆసక్తికరంగా చర్చ సాగుతోంది. సాహో చిత్రంపై ట్రేడ్ లో అంతకంతకు అంచనాలు పెరుగుతున్నాయి. కెన్నీ బేట్స్ చిత్రీకరించిన భారీ యాక్షన్ దృశ్యాల్ని గ్రాఫిక్స్ మిక్స్ చేశాక అంతకుమించి అద్భుతంగా ఎలివేట్ అవుతున్నాయని తెలుస్తోంది.
ఆగస్టు 15 స్వాతంత్య్రదినోత్సవ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ఇప్పటికే చిత్రయూనిట్ సీరియస్ గా సన్నాహకాల్లో ఉంది. అందుకే వేగంగా అన్ని పనులు పూర్తి చేస్తున్నారు. ప్రభాస్ సహా కీలక తారాగణంపై ఇప్పటికే రామోజీ ఫిలింసిటీలో భారీ షెడ్యూల్ ని తెరకెక్కిస్తున్నారు. ఓవైపు షూటింగ్ జరుగుతుండగానే సైమల్టేనియస్ గా నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. ఇక ప్రచారం పరంగానూ వేగం పెంచేందుకు సాహో టీమ్ ప్రిపేరవుతోందట. ఇదివరకూ రిలీజ్ చేసిన `షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1`గా యూట్యూబ్ లో 10 కోట్ల వ్యూస్ తో సంచలనాలు సృష్టించింది. విదేశాల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఎలాంటి రిస్క్ చేశారో ఈ వీడియో ఎలివేట్ చేసింది. తాజాగా `షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2` మేకింగ్ వీడియోని విడుదల చేసేందుకు టీమ్ రెడీ అవుతోంది. ఈ వీడియోను మార్చి 3న రిలీజ్ చేస్తారట. ఇందులో చాలా కోణాల్లో `సాహో` విజువల్స్ ని ఎడిట్ చేస్తున్నారని తెలిసింది. ఈ రెండో మేకింగ్ వీడియో చాప్టర్ 1తో పోలిస్తే మరింత స్పెషల్ గా తీర్చిదిద్దుతున్నారట. వీడియో ఆద్యంతం ప్రభాస్ ను ఎలివేట్ చేసే దృశ్యాలు - భారీ యాక్షన్ కట్టి పడేస్తుందని తెలుస్తోంది. స్పెషల్ గా డైనో -యారి18కెడబ్ల్యూ లైట్ సెట్టింగ్స్ ఉపయోగించి కొన్ని షాడో షాట్స్ ని తెరకెక్కించారు. ఇవి వీడియోకే హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. సాహో మేకింగ్ చాప్టర్ 2 యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించడం ఖాయమని అంచనా వేస్తున్నారు.