పెళ్లి గురించి అడిగితే ప్రభాస్ ఏమన్నాడంటే..

Update: 2017-04-17 06:59 GMT
ప్రభాస్ పెళ్లి గురించి గత కొన్నేళ్లుగా ఎంత చర్చ నడిచిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’ అంటూ ప్రభాస్ పెళ్లి వ్యవహారాన్ని కామెడీ చేస్తూ ఓ సినిమాకు టైటిల్ కూడా పెట్టుకుంది ఓ చిత్ర బృందం. ‘బాహుబలి’ అవ్వగానే పెళ్లి అని అప్పట్లో తప్పించేసుకున్న ప్రభాస్.. నాలుగేళ్ల పాటు ఆ సినిమాకు అంకితమైపోయాడు. ఈ సినిమా పూర్తయి కూడా నాలుగు నెలలు దాటిపోయంది. అయినా ప్రభాస్ పెళ్లి గురించి ఏ కబురూ బయటికి రాలేదు. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజును మీడియా వాళ్లు దీని గురించి అడుగుదామంటే ఆయన దొరకట్లేదు. ఈలోపు ప్రభాసే మీడియా వాళ్లకు చిక్కాడు.

‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రమోషన్ల కోసం మీడియాను కలిసిన ప్రభాస్ ను పెళ్లి సంగతి అడిగితే.. ‘నో ఐడియా’ అంటూ ఆశ్చర్యకర సమాధానం ఇచ్చాడు. ఇంతకుముందులాగా బాహుబలి సాకు చెప్పడానికి అతడికి అవకాశం లేకపోయె. కొత్తగా చేస్తున్న సుజీత్ సినిమా ఎలాగూ ఈ ఏడాదే అయిపోతుంది. దాని తర్వాత చేసుకుంటా అని కూడా ప్రభాస్ చెప్పలేదు. అసలు ఎప్పుడు ఏంటి అన్న ఊసే ఎత్తకుండా నో ఐడియా అనడం అందరికీ పెద్ద షాకే. ఇప్పటికే ప్రభాస్ కు 37 ఏళ్లు వచ్చేశాయి. ‘బాహుబలి’ చేసేముందు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే అతన వన్ ఆఫ్ ద మోస్ట్ ఎలిజిబల్ బ్యాచిలర్స్. కానీ ఇప్పుడు అతను ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్నాడు. మరి ఈ బ్యాచిలర్ జీవితానికి ఎప్పుడు చరమగీతం పాడుతాడో ఏమో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News