డార్లింగ్ రేంజ్ అంటే అంతకు మించి

Update: 2018-10-23 11:22 GMT
ఇవాళ విడుదలైన సాహో షేడ్స్ వీడియో ప్రభాస్ అభిమానులనే కాదు సినిమా ప్రేమికులందరిని షాక్ కి గురి చేసింది. మేకింగ్ విజువల్స్ అయినప్పటికీ కళ్ళు చెదిరే యాక్షన్ ఎపిసోడ్స్ తో ఎప్పుడెప్పుడు చూద్దామా అనే రేంజ్ లో చిత్రీకరించినట్టు కనిపించడంతో ఇక ఎదురుచూపులు కష్టమే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అబుదాబిలో చిత్రీకరించిన 30 రోజుల షెడ్యూల్ గురించి షూటింగ్  జరుగుతున్న సమయంలో అప్ డేట్స్  ఇవ్వలేదు కానీ ఈ రేంజ్ మేకింగ్ మాత్రం నిజంగా ఎవరూ ఊహించనిది.

వంద కోట్లకు పైగా బడ్జెట్ అంటే నిజమా అని కొందరు నోళ్లు నొక్కుకున్నారు కానీ బ్లాస్ట్ కు ఉపయోగించాల్సిన కార్లను అద్దెకు తేకుండా ఏకంగా తయారు చేయించి మరీ పేల్చడం చూస్తుంటే ఎక్కడా రాజీ అన్న ప్రసక్తి వచ్చినట్టు కనిపించడం లేదు. ప్రభాస్ నడక ద్వారా ఒక్క షాట్ లో మాత్రమే హీరోని రివీల్ చేసినప్పటికీ అదే మహా ప్రసాదం అంటున్నారు ఫాన్స్. ఇప్పటికి అందరి మనసు కుదుటపడినట్టే. ఇప్పటిదాకా బాలీవుడ్ కే పరిమితమైన క్వాలిటీ మేకింగ్ బాహుబలి తర్వాత మరో కొత్త కోణంలో సాహో రూపంలో బయటపడే సరికి ఇది హాలీవుడ్ లో రిలీజ్ చేసినా మంచి స్పందన దక్కుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ ని విపరీతంగా ఇష్టపడే వాళ్లకు ఇలాంటి యాక్షన్ ఫార్ములాలు మరీ ఎగ్జైట్ చేయకపోయినా అందులో ప్రభాస్ లాంటి తెలుగు హీరోలు చేస్తున్నప్పుడు వచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. ఇదంతా బాగానే ఉంది కానీ సాహో షేడ్స్ సందడి కొద్దిరోజులు అయ్యాక ముగుస్తుంది. మరి విడుదల విషయంలో ఏర్పడ్డ కన్ఫ్యూజన్ మాత్రం ప్రస్తుతానికి అలాగే కొనసాగుతుంది. వచ్చే వేసవా లేక అంతకంటే ముందా అనేది తేలడానికి కొంత టైం పట్టేలా ఉంది
    

Tags:    

Similar News