#క‌రోనా: సింపుల్ గా మెసేజ్ పెట్టి స‌రిపెట్టాడు!

Update: 2020-03-17 08:15 GMT
క‌రోనా క‌ల్లోలంపై టాలీవుడ్ సెల‌బ్రిటీలు ఒక్కొక్క‌రుగా స్వ‌చ్ఛందంగా ముందుకొచ్చి ప్ర‌జ‌ల‌కు జాగ్ర‌త్త‌లు చెప్పి అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. చ‌ర‌ణ్ .. ఎన్టీఆర్ .. అమితాబ్ స‌హా ఎంద‌రో సినీప్ర‌ముఖులు క‌రోనా విప‌త్తుపై త‌మ సందేశం అందించారు. అవ‌న్నీ అభిమానుల్లోకి వైర‌ల్ గా దూసుకెళ్లాయి. ఇక పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వంతు.

ఓవైపు క‌రోనా క‌బ‌ళించేస్తుంటే త‌న‌కు అదేమీ ప‌ట్ట‌న‌ట్టు ఒక మాస్క్ పెట్టుకుని యూరప్ వెళ్లిపోయాడు డార్లింగ్. అక్క‌డ ప్ర‌స్తుతం జాన్ షూటింగులోనూ పాల్గొంటున్నాడు. ఇక‌పోతే ప్ర‌భాస్ డేరింగ్ ఫీట్ పై అభిమానులు కాస్త క‌ల‌త‌కు గురైనా ఆ త‌ర్వాత త‌ను చేసిందే క‌రెక్ట్ అని అర్థం చేసుకున్నారు. ఇక అలా డేర్ చూపించ‌డ‌మే కాదు.. తాజాగా క‌రోనాపై సాగుతున్న త‌ప్పుడు ప్ర‌చారాన్ని ఖండిస్తూ ప్ర‌భాస్ ఇచ్చిన సంక్షిప్త సందేశం వైర‌ల్ గా మారింది. ఇంత‌కీ క‌రోనా పై ప్ర‌భాస్ ఏమ‌న్నారు? అభిమానుల‌కు ఏమ‌ని సందేశం ఇచ్చారు? ప‌్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేశారా? అంటే..

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రజల్ని త‌న‌దైన పంథా లో అప్ర‌మ‌త్తం చేశారు. ``ప్రజలు తప్పుడు సమాచారానికి దూరంగా ఉండాలని కోరాడు. ``అవును.. ఇది క్లిష్ట స‌మ‌యం. ప్రజా భద్రతా సవాలు.. ప్ర‌జారోగ్యానికి సంబంధించిన‌ద‌ని గుర్తుంచుకోండి. కోవిడ్ 19 మహమ్మారిని జయించడం లో మనలో ప్రతి ఒక్కరికీ పాత్ర ఉండాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పుడు సమాచారం నుండి దూరంగా ఉండటం దాని తీవ్రతను అరికట్టడానికి సహాయపడుతుంది`` అని తెలిపాడు. అవ‌స‌రం మేర జాగ్ర‌త్త‌లు తీసుకుంటే వైర‌స్ మ‌న‌ల్ని ఏమీ చేయ‌లేద‌ని ప్ర‌భాస్ త‌న యాక్టివిటీ ద్వారా ఇప్ప‌టికే వెల్ల‌డించాడు. ఇటీవ‌లే ఫ్రాన్స్ వెళుతూ.. ప్రభాస్ విమానాశ్రయాల లో ముసుగు ధరించడం చూశాం. ఒక‌ బాధ్యతాయుతమైన పౌరుడిగా ప్ర‌భాస్ ఈ ప్ర‌పంచ సంక్షేమాన్ని కోరుతుండ‌డం యూనిక్ అనే చెప్పాలి.

ముఖ్యంగా ఫేక్ ప్ర‌చారాన్ని అస్స‌లు న‌మ్మొద్ద‌ని తెలిపాడు. సింపుల్ గా చెప్పినా డార్లింగ్ ఒక మంచి మాట చెప్పాడు. సంక్షిప్త సందేశం తో హృద‌యాల్ని కొల్ల‌గొట్టాడు. అయిన‌దానికి కాని దానికి భ‌య‌పెట్టేస్తున్న సోష‌ల్ మీడియా తీరుని అత‌డు తెలివిగా ఎండ‌గ‌ట్టాడ‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం రాధా కృష్ణ కుమార్ తెర‌కెక్కిస్తున్న జాన్..షెడ్యూల్ జార్జియాలో కొనసాగుతోంది. ప్ర‌భాస్ కంటే ముందే.. పూజా హెగ్డే - ప్రియదర్శి సామాజిక మాధ్య‌మాల్లో త‌మ‌ ముసుగు ఫోటోల్ని అభిమానుల‌కు షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా వ‌ల్ల విమ‌నాశ్ర‌యాల‌న్నీ ఖాళీ అయిపోయాయ‌ని ద‌ర్శి ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.
Tags:    

Similar News