హీరో 46 రోజులు.. కమెడియన్ 43 రోజులు

Update: 2016-01-07 14:00 GMT
చిన్నదైనా సరే.. పెద్దదైనా సరే.. తెలుగు సినిమాలో అత్యధిక స్క్రీన్ ప్రెజెన్స్ ఉండేది హీరోకే. కమెడియన్లకు ఎంత మంచి క్యారెక్టర్ పడ్డప్పటికీ.. హీరోలతో సమానంగా క్యారెక్టర్ ఉండటం.. స్క్రీన్ టైం ఇవ్వడం అరుదుగా జరుగుతుంది. ఐతే ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ఈ అరుదైన జాబితాలోకే చేరుతుందని అంటున్నాడు కమెడియన్ ప్రభాస్ శ్రీను. ఈ సినిమాను తనకు హీరో శర్వానంద్ తో సమానంగా స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుందని శ్రీను చెప్పాడు.

‘ఎక్స్ ప్రెస్ రాజా’ కోసం హీరో శర్వానంద్ 46 రోజులు కాల్ షీట్స్ ఇస్తే.. తాను 43 రోజులు ఈ సినిమా కోసం వర్క్ చేశానని.. శ్రీను వెల్లడించాడు. శర్వానంద్ తో పోలిస్తే తనకు 3 రోజులు తగ్గడానికి కూడా ఓ కారణముందని.. సినిమాలో తను లేకుండా హీరో హీరోయిన్లతో దర్శకుడు ఓ డ్యూయెట్ తీశాడని, ఆ పాట షూటింగుకు మాత్రం తనను పిలవలేదని చమత్కరించాడు శ్రీను.

‘ఎక్స్ ప్రెస్ రాజా’లో తాను హీరోకు మావయ్యగా నటించానని.. శర్వా కనిపించే ప్రతి సన్నివేశంలో తాను కనిపిస్తానని.. సినిమాలో ప్రతి కామెడీ సీన్, ప్రతి జోక్, ప్రతి ట్విస్టులోనూ తాను ఉంటానని.. ఇది తన కెరీర్ ను మలుపు తిప్పే పాత్ర అని శ్రీను వెల్లడించాడు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’తో తనకు మంచి పేరు తెచ్చిపెట్టిన మేర్లపాక గాంధీ.. ఈసారి తన కెరీర్లో ఎప్పటికీ గుర్తుంచుకునే పాత్రను ఇచ్చినందుకు రుణపడి ఉంటానని శ్రీను చెప్పాడు.
Tags:    

Similar News