కారు వద్దు.. డబ్బులు కావాలన్న లవ్ టుడే డైరెక్టర్

Update: 2022-11-30 04:52 GMT
సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ అనే యువ దర్శకుడు పేరు బాగా వైరల్ గా మారింది. ఈ యువ దర్శకుడు ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. సినిమా ఇండస్ట్రీ తో ఎలాంటి సంబంధం లేకుండా సొంతంగా సోలోగా ఎదిగాడు. ఇటీవల అతను దర్శకత్వం వహించి నటించిన లవ్ టుడే సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినిమా తమిళంలోనే పెట్టిన పెట్టుబడికి ఊహించని స్థాయిలో ప్రాఫిట్ అందించింది.

ఇక అదే స్టోరీ పాయింట్ దిల్ రాజుకు బాగా నచ్చడంతో తెలుగులో కూడా తన సపోర్టుతో భారీ స్థాయిలోనే విడుదల చేశారు. ఇక ఇక్కడ కూడా ఈ సినిమా బిజినెస్ కు తగ్గట్టుగా మంచి ప్రాఫిట్స్ అయితే అందిస్తోంది. అయితే ఈ దర్శకుడు ఈ స్థాయికి రావడానికి దాదాపు 7 ఏళ్ల పాటు స్ట్రగుల్ కావాల్సి వచ్చింది. ఖాళీగా ఉండకుండా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసుకుంటూ వచ్చాడు.

అయితే అతను చేసిన నాలుగు షార్ట్ ఫిలిమ్స్ కు కూడా మంచి గుర్తింపు లభించింది. వాటిపై కొంతమంది సినీ ప్రముఖులు కూడా పాజిటివ్ గా స్పందించారు. దర్శకుడిగా రచయితగా నటుడిగా అతను మంచి క్రేజ్ కూడా అందుకున్నాడు.

ఇక మొదట అతను జయం రవితో 2019లో కోమలి అనే సినిమాను తెరపైకి తీసుకు వచ్చాడు. ఆ సినిమా సక్సెస్ కావడంతో చిన్న బడ్జెట్ లోనే లవ్ టుడే సినిమాను తెరపైకి తీసుకొచ్చి సక్సెస్ అందుకున్నాడు.

అయితే కోమలి సినిమా సక్సెస్ అయినప్పుడు అతనికి నిర్మాతలు ఒక కారును గిఫ్ట్ గా ఇచ్చారట. కానీ అతను ఆ కారును వెనక్కి తిరిగి ఇచ్చేసి దాని ఖరీదు ఎంతో అంత డబ్బు ఇవ్వాలి అని కోరాడట.

ఎందుకంటే అప్పుడు అతను ఉన్న పరిస్థితుల్లో కారును మెయింటైన్ చేస్తూ రోజు పెట్రోల్ కొట్టించే స్థాయిలో డబ్బులు కూడా లేవని మళ్లీ మరొక సినిమా చేసే వరకు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అంటే కొంత డబ్బు అవసరం అని ఆ విధంగా నిర్మాతలను కోరాడట. ఇండస్ట్రీలోకి వచ్చింది నేను.. అనుకున్న కలను సాధించడం కోసమే అని ఈ ఒక్క ఉదాహరణతో ప్రదీప్ చాలా క్లారిటీగా వివరణ ఇచ్చాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News