ఇప్పటి హీరోయిన్లందరూ క్యూట్ అని కాకుండా.. హాట్ అనిపించుకోవాలనే చూస్తున్నారు. కెరీర్ ఆరంభంలో చేసిన సినిమాలతో ట్రెడిషనల్ ఇమేజ్ వచ్చినా.. దాన్ని పోగొట్టుకోవడానికి గట్టిగా కష్టపడుతున్నారు. గ్లామర్ ఇమేజ్ తెచ్చుకుంటే తప్ప ఇక్కడ మనుగడ కష్టం. ‘కంచె’ సినిమాతో సంప్రదాయబద్ధమైన కథానాయిక లాగా కనిపించిన ప్రగ్యా జైశ్వాల్.. ఆ తర్వాత రూటు మార్చేసింది. ‘గుంటూరోడు’.. ‘జయ జానకి నాయక’ సినిమాల్లో సెక్సీగా కనిపించింది. ఐతే ‘కంచె’ ఇమేజ్ తనను ఇంకా వీడిపోవట్లేదని.. ఇప్పటికీ జనాలు తనను చీరల్లో చూడాలనే కోరుకుంటున్నారని.. ఇదేం న్యాయమని ప్రశ్నిస్తోంది ప్రగ్యా.
‘‘ఈ మధ్య ఒక ఆడియో వేడుకలో నేను మోకాళ్ల పైకి ఉండే డ్రెస్ వేసుకున్నాను. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. కొందరేమో.. ‘మీరు సీత (కంచెలో క్యారెక్టర్). మీరు రాజకుమారి లాగా ఉండాలి. ఇలాంటి డ్రెస్సుల్లో కనిపించకండి. చీరల్లోకి మారండి’ అంటూ నాకు క్లాస్ పీకే ప్రయత్నం చేశారు. నన్ను సీత పాత్రలో గుర్తుంచుకున్నందుకు సంతోషమే. ‘కంచె’ విడుదలై రెండేళ్లు దాటినా నన్ను సీతగా మరిచిపోలేదు. ఐతే ఎప్పుడూ నేను చీరల్లోనే కనిపించాలని కోరుకుంటే ఎలా? నాకు ఒక ఇమేజ్ ఛట్రంలో కూరుకుపోవడం ఇష్టం లేదు. భిన్నమైన పాత్రల్లో నన్ను నేను చూసుకోవాలనుకుంటున్నా. ‘కంచె’ ఇమేజ్ పోగొట్టుకోవడం కోసమే ‘జయ జానకి నాయక’లో పూర్తి స్థాయి గ్లామర్ క్యారెక్టర్లో కనిపించాను’’ అని ప్రగ్యా చెప్పింది.