ఫోటో స్టొరీ: హాటు సందేశం ఇచ్చిన బ్యూటీ

Update: 2019-07-02 08:44 GMT
హాటు బ్యూటీలందరూ రెగ్యులర్ గా చేసే పని ఏంటంటే.. చక్కగా రెడీ కావడం.. ఫోటో షూట్లు చేయడం.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. అప్పుడేమౌతుంది అంటే.. ఇంకేమౌతుంది 'దెబ్బకు ఠా.. దొంగల ముఠా' తరహాలో నెటిజన్ల ముఠా అల్లాడిపోతారు.  ఈ కిటుకు ఈ జెనరేషన్ బ్యూటీలందరికీ తెలిసిందే.. 'కంచె' బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు.

రెగ్యులర్ గా ఏదో ఒక హాటు ఫోటో పోస్ట్ చేస్తూ తన అభిమానులతో టచ్ లో ఉంటుంది.  తాజాగా మరోసారి అదే పని చేసింది.  ఈ ఫోటోకు "హాట్ గా ఉండేలా ఒకటి వదలండి" అని క్యాప్షన్ ఇచ్చింది.  ఇదేదో నెటిజన్లపై కత్తి కట్టి ఒక హాట్ బాంబును సోషల్ మీడియాపై విసరండి అనే ఘాటు సందేశం ఇచ్చినట్టు ఉంది. చాలామంది మేథావుల తరహాలో 'మాటలు' మాత్రమే కాకుండా ఒక హాటు ఫోటోను వదిలి చేతల రాణి  అని నిరూపించుకుంది.  ఈ ఫోటోలో ఒక బ్లాక్ కలర్ బికినీ లాంటి డ్రెస్ వేసుకొని సైడ్ యాంగిల్ లో సెన్సువల్ గా పోజిచ్చింది. బ్రౌన్ షేడ్ లో హెయిర్ స్టైలింగ్ చెయ్యడంతో ప్రగ్య యమా స్టైలిష్ గా ఉంది.  ఆ స్కిన్ టోన్ "పట్టు లాంటి చర్మం" అని యాడ్ వస్తుంటుంది చూడండి.. ఆ యాడ్ లో పట్టు ఉంటుందో ఉండదో దేవుడెరుగు.. ఈ ఫోటోలో మాత్రం ఆ పట్టు చర్మం ఉంది.

దీనికి ఇంట్రెస్టింగ్ కామెంట్లే పెట్టారు నెటిజన్లు.  "ఫ్యాషనబుల్ అండ్ ఎలిగెంట్".. "కళ్ళు అందంగా ఉన్నాయి".  "మోస్ట్ లవబుల్ లుక్" అంటూ కామెంట్లు పెట్టారు. ఇక  సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'సైరా' లో ఒక కీలకపాత్రలో నటిస్తోంది.
Tags:    

Similar News