విష్ణు మాటలకు హర్ట్ అయ్యాను .. అందుకే అలా రియాక్ట్ అయ్యాను: ప్రకాశ్ రాజ్
రోజు రోజుకీ 'మా' ఎన్నికల వేడి పెరుగుతోంది. 'మా' అధ్యక్ష పదవి పోటీ నుంచి సీవీఎల్ తప్పుకున్నారు. అందుకు గల కారణాలను తరువాత చెబుతానంటూ సస్పెన్స్ లో పెట్టేశారు. ఇక ఇప్పుడు బరిలో మంచు విష్ణు - ప్రకాశ్ రాజ్ మాత్రమే నిలిచారు. అయితే ఈ ఇద్దరి మధ్య పోటీ చాలా బలంగా ఉంది. ఈ నేపథ్యంలో వీరు ఆయా సందర్భాల్లో మీడియాతో మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఒక్కో సమయంలో సహనంతో వ్యవహరిస్తూ వచ్చినప్పటికీ, ఒక్కోసారి సహనాన్ని కోల్పోతున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకరి స్థాయిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
ఈ సారి 'మా' ఎన్నికల చుట్టూ అనేక సమస్యలు అల్లుకున్నాయి. దాంతో ఇండస్ట్రీలో ఒక రకమైన గందరగోళ వాతావరణం కనిపిస్తోంది. ఎవరు ఎక్కడ ఏ సందర్భంలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. మనసులు .. నిర్ణయాలు చకచకా మారిపోతున్నాయి. దాంతో అంతవరకూ ఇచ్చిన ఇంటర్వ్యూలు .. చేసిన సవాళ్లు 'టైమ్ పాస్ బఠాణి' అన్నట్టుగా తయారైపోయింది. కొంతమంది మీడియా ముందు నుంచి బయటికి రాగానే రియలైజ్ అవుతున్నారు. ఆ తరువాత అవతలవారిని కూల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక మరికొందరు అలాంటి ప్రయత్నాలు కూడా ఎంతమాత్రం చేయడం లేదు. రేప్పొద్దున అందరం కలిసి ఒక సెట్టు కింద పని చేయవలసిన వాళ్లమనే ఆలోచనే చేయడం లేదు. అయితే ప్రకాశ్ రాజ్ మాత్రం అపుడప్పుడు కాస్త తొందరపడి మాట్లాడినా, ఆ తరువాత ఆ మాటల్లోని తీవ్రతని తగ్గించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ 'రిపబ్లిక్' సినిమా ఫంక్షన్ వేదికపై థియేటర్లు - టిక్కెట్ల గురించిన సమస్యను ఒక రేంజ్ కి తీసుకెళ్లి అక్కడ వదిలేశారు. దాంతో సమస్య పరిష్కారం కాకపోగా మరింత జటిలమవుతుందని భావించిన వారంతా, 'ఆయన మాటలతో మాకు సంబంధం లేదనేశారు.
అయితే ఈ విషయంలో పవన్ ను సపోర్ట్ చేస్తున్నట్టుగా ప్రకాశ్ రాజ్ మాట్లాడారు. దాంతో 'ప్రకాశ్ రాజ్ ఇండస్ట్రీ పక్కన ఉన్నాడా? లేకపోతే పవన్ కల్యాణ్ పక్కనున్నాడా? స్పష్టం చేయాలనే ప్రశ్నను మంచు విష్ణు సంధించారు. ఆయన ఈ విధంగా మాట్లాడటం, పట్ల ప్రకాశ్ రాజ్ తీవ్రమైన సహనాన్ని వ్యక్తం చేశారు. "ఏం మాట్లాడుతున్నారు? పవన్ కల్యాణ్ మార్నింగ్ షో కలెక్షన్ అంత ఉండదు మీ సినిమా బడ్జెట్' అంటూ మండిపడ్డారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై నీళ్లు చల్లుతూ, ఈ కామెంట్ కాక తగ్గించే ప్రయత్నంలో ప్రకాశ్ రాజ్ ఉన్నారు.
తాజాగా ఆయన మాట్లాడుతూ .. "మోహన్ బాబు బంగారం .. ఆయన పిల్లలు కూడా అంతే. వాళ్లందరూ నాకు చాలా కాలంగా తెలుసు. మోహన్ బాబుగారు అంటే నాకు గౌరవం .. ఆయన పిల్లలంటే ఇష్టం. వాళ్ల పట్ల తనకి గల అభిమానం ఎప్పుడూ తగ్గదు. ఒక ఇంటర్వ్యూలో విష్ణు అలా మాట్లాడటం నిజంగా నాకు చాలా బాధను కలిగించింది. అందువల్లనే అలా రియాక్ట్ అయ్యానే తప్పించి, వ్యక్తిగతమైన మరే కారణాలు ఇందులో లేవు" అని చెప్పుకొచ్చాడు. ప్రకాశ్ రాజ్ కాస్త మెత్తబడి ఈ తరహా వివరణ ఇచ్చారు కానీ, అవతల వైపు నుంచి రానున్న రియాక్షన్ కి ఎలాంటి ఎఫెక్టులు వేసుకోవాలా అనే వెయిటింగులో చాలామందే ఉన్నారు.