మామ అల్లుళ్ళ స్వర విలాపం

Update: 2018-09-26 12:07 GMT
హీరోలు సింగర్లు గా మారడం కొత్తేమి కాదు. కెరీర్ మొదట్లో అక్కినేని గారు ఓ రెండు మూడు పాటలు ఆయనే పాడుకున్నారని కొందరు చెబుతూ ఉంటారు. ఆ తర్వాత ఇంకెవరు పెద్దగా సాహసించలేదు కానీ మాస్టర్ సినిమా కోసం దేవా సంగీత దర్శకత్వంలో చిరంజీవి తమ్ముడు అరె తమ్ముడు అని మెప్పించడంతో అందరు మెల్లగా ఈ దారిలో రావడం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ చాలా సార్లు తన గొంతును సవరించాడు. నాగార్జున సీతారామారాజులో ఏకంగా ఫుల్ సాంగ్ పాడేస్తే వెంకటేష్ కాస్త లేట్ గా గురు కోసం సింగర్ గా మారాడు. ఇక బాలయ్యకు వంద సినిమాలు అయ్యాక కానీ పైసా వసూల్ లో పాడే ధైర్యం రాలేదు. వీళ్లకు తోడు హీరోయిన్లు అప్పుడప్పుడు శృతి కలుపుతూనే ఉన్నారు.

ఇప్పుడు ఈ బ్యాచ్ లో రామ్ కూడా జాయిన్ అవుతున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 18న విడుదల కాబోతున్న హలో గురు ప్రేమ కోసమే కోసం దేవి శ్రీ ప్రసాద్ రామ్ ని సింగర్ ని చేసేసాడు. ఇక్కడితో ట్విస్ట్ అయిపోలేదు. ఆ పాట రెండు పాత్రల కాంబినేషన్ లో వస్తుందట. ఒకరు రామ్ అయితే మరొకరు ప్రకాష్ రాజ్. ఇందులో ఈయన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు తండ్రిగా నటిస్తున్నారని ముందు నుంచే ప్రచారంలో ఉంది. ఫ్రెండు కొద్దిగా మార్చు ట్రెండు అంటూ హుషారుగా సాగే ఈ గీతంలో రామ్ ఎలాగూ పాడుతున్నాడు కదా అని సహజత్వం కోసం ప్రకాష్ రాజ్ ని సైతం స్వరం కలపమని చెప్పడంతో ఆయన కూడా సరే అని మైకందుకున్నారు. దీంతి హీరో ప్లస్  క్యారెక్టర్ ఆర్టిస్ట్ కలిసి పాడిన స్పెషల్ సాంగ్ గా ఇది నిలవబోతోంది.

ఇటీవలే ఫ్లైయింగ్ అంటూ ఓ ఆడియో ట్రాక్ విడుదల చేసిన టీమ్ త్వరలో దీన్ని రిలీజ్ చేయబోతున్నారు. త్రినాధరావు దర్శకత్వం వహించిన హలో గురు ప్రేమ కోసమే మీద టీజర్ వచ్చాక అంచనాలు పెరగడం మొదలైంది. త్వరలో ఆడియో లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేందుకు నిర్మాత దిల్ రాజు ఏర్పాట్లలో ఉన్నారు.
Tags:    

Similar News