గతంలో ఎప్పుడూ లేనంత ఉద్రిక్త వాతావరణంలో ‘మా’ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పాలి. ఎప్పుడూ కూడా ఇంత కాలం పాటు ‘మా’ ఎన్నికల ఎపిసోడ్ సాగలేదు. మహమ్మారి కారణంగా ఎన్నికలు వాయిదా పడటం.. అనంతరం పోటీలోకి ప్రకాశ్ రాజ్ రావటంతో వాతావరణం కాస్తా వేడెక్కిపోవటం.. దాన్ని డబుల్ చేస్తూ.. మంచు విష్ణు ఎంట్రీ ఇవ్వటం తెలిసిందే. అలా మొదలైన ‘మా’ ఎన్నికల రచ్చ అంతకంతకూ పెరుగుతుందే కానీ తగ్గని పరిస్థితి. మరి కొద్ది రోజుల్లో జరిగే ఎన్నికల్లో తన తరఫున వారిని గెలిపించాలని కోరుతూ అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న ప్రకాశ్ రాజ్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి షాకింగ్ వ్యాఖ్యలు వచ్చాయి. ‘మా’ సిగ్గుపడేలా నటుడు నరేశ్ వ్యవహరిస్తున్నారని.. ఆయన అహంకారి అని.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్ రాజ్ తాజా వ్యాఖ్యలతో వాతావరణం మరింత వేడెక్కింది. తాజాగా జరిగిన కార్యక్రమంలో విష్ణు ప్యానల్.. నరేశ్ మీద మండిపడిన ప్రకాశ్ రాజ్.. ఈసారి జరిగే ఎన్నికల్లో పెద్దల ఆశీర్వాదం తనకు వద్దని.. పెద్ద వాళ్లను సైతం ప్రశ్నించే సత్తా ఉన్న వాడే ‘మా’ అధ్యక్షుడిగా గెలవాలన్నారు.
ఆ సత్తా తనకు ఉందని.. అందుకే తాను ఈసారి ఎన్నికల్లో గెలవనున్నట్లుగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను తెలుగువాడినికాదన్న నరేశ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఫైర్అయ్యారు. తాను తెలుగు మాట్లాడినంతగా విష్ణు ప్యానల్ లో ఎవరూ మాట్లాడలేదన్న ఆయన.. తనను పెంచింది తెలుగు భాష అని.. మంచు విష్ణు నరనరాల్లో నటన ఉందని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
తమ ప్యానల్ లో ఉన్న సభ్యుల్లోని ప్రతి ఒక్కరిలోనూ ఆత్మాభిమానం ఉందని.. తాము ప్రశ్నించకపోతే ‘మా’ ఎన్నికలే ఉండేవి కాదన్నారు. తాను ఒక ఉత్తరం రాస్తే ‘మా’ అసోసియేషన్ కు తాళం పడేదని.. సౌమ్యంగా కాదు కోపంగా మాట్లాడటం కూడా తనకు తెలుసన్నారు. ఎన్నికల్లోకి జగన్.. కేసీఆర్.. బీజేపీలను తేవొద్దన్నారు. వైఎస్ జగన్ మీకు బంధువైతే.. మా ఎన్నికల్లోకి ఆయన వస్తారా? కేటీఆర్ రెండుసార్లు హలో చెబితే స్నేహితుడు అయిపోతారా? అని ప్రశ్నించారు.
గెలవటానికి ప్రయత్నించాలే కానీ.. అవతలివారిని ఓడించటానికి కాదన్న ప్రకాశ్ రాజ్.. ఓట్ల సునామీలో విష్ణు ప్యానల్ కొట్టుకుపోతుందన్నారు. ఇప్పటికే వేడెక్కి ఉన్న వాతావరణానికి ప్రకాశ్ రాజ్ మాటలు మరింత మంట పుట్టేలా ఉండటమేకాదు.. ఇప్పటికే గుర్రుగా ఉన్న విష్ణు బ్యాచ్.. మరింత విరుచుకుపడటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.