మ‌ళ్లీ ప్ర‌కాష్‌ రాజ్ లొల్లేంటి?

Update: 2018-08-24 04:18 GMT
విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్‌ రాజ్ ఆన్ లొకేష‌న్ ఫైటింగ్స్ గురించి తెలిసిందే. ఇదివ‌ర‌కూ మ‌హేష్ `ఆగ‌డు` టైమ్‌ లో శ్రీ‌నువైట్ల అసిస్టెంట్ల‌తో గొడ‌వ పెట్టుకోవ‌డం, ఆ త‌ర్వాత అది ర‌చ్చ‌వ్వ‌డం - ఫిలింఛాంబ‌ర్ ఇన్వాల్వ్ అయ్యేవ‌ర‌కూ వెళ్లింది  సీన్‌. విల‌క్ష‌ణ న‌టుడు స‌రైన స‌మ‌యానికి ఆన్ లొకేష‌న్ రాడ‌ని - వ‌చ్చినా కోస్టార్స్‌ తో రూడ్‌ గా ప్ర‌వ‌ర్తిస్తాడ‌ని - ప్ర‌తిభ ఎంత ఉన్నా.. ఇటీవ‌ల ఛాన్సులు త‌గ్గ‌డానికి కార‌ణ‌మిదేన‌ని కామెంట్లు వినిపిస్తుంటాయి. పైగా టెక్నిక‌ల్ సైడ్ అన్నిట్లోనూ వేలు పెడ‌తాడ‌న్న బ్యాడ్ టాక్ ఎలానూ ఉంది.

అయితే ఇందులో వాస్త‌వాలు ఎలా ఉన్నా.. ఇప్ప‌టికైతే ఇలాంటి బ్యాడ్ టాక్ స‌ద‌రు సీనియ‌ర్ న‌టుడిపై కంటిన్యూగా ర‌న్ అవ్వ‌డం ఇబ్బందిక‌ర‌మే. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ప్ర‌కాష్‌ రాజ్ దిల్‌ రాజు ఉన్న `హ‌లోగురు ప్రేమ‌కోస‌మే` సెట్‌ లోనే గొడ‌వ‌ప‌డ్డార‌ట‌. అది కూడా చిత్ర‌క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ తో లొల్లి పెట్టుకున్నాడ‌ని ప్ర‌చార‌మైంది. అయితే దానిని అనుప‌మ ఖండించిన సంగ‌తి తెలిసిందే. అయితే దాంతో సంబంధం లేకుండా మ‌రో రూమర్ కూడా వినిపిస్తోంది.

కేవ‌లం క‌థానాయిక‌తోనే కాదు - సినిమాటోగ్రాఫ‌ర్ విజ‌య్‌.కె.చ‌క్ర‌వ‌ర్తితోనూ ప్ర‌కాష్‌ రాజ్ గొడ‌వ‌ప‌డ్డార‌ని ఫిలింన‌గ‌ర్‌ లో చెప్పుకోవ‌డం చ‌ర్చ‌కొచ్చింది. తాను క్లోజ్ షాట్ పెట్ట‌మంటే విజ‌య్ లాంగ్ షాట్ పెట్టార‌ట‌. దానిని మార్చ‌మ‌ని ప్ర‌కాష్‌ రాజ్ స‌తాయిస్తే కుద‌ర‌ద‌ని స‌ద‌రు సినిమాటోగ్రాఫ‌ర్ మొండికేశార‌ట‌. ఆ క్ర‌మంలోనే ఇద్ద‌రి మ‌ధ్యా ఘ‌ర్ష‌ణ ముదిరింద‌ని చెప్పుకుంటున్నారు. ముందు క్లోజ్ షాట్ తీసుకుని, ఆ త‌ర్వాత లాంగ్ షాట్‌ కి డూప్‌ ని ఉప‌యోగించుకోవాల్సిందిగా ప్ర‌కాష్‌ రాజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌ కి సూచించాడ‌ట‌. అప్ప‌టికే సెట్ చేసిన‌ కెమెరా సెట‌ప్‌ ని మార్చ‌లేమ‌ని అత‌డు విన‌లేదట‌. మొత్తానికి రుబాబ్ అయితే జ‌రిగింద‌న్న‌ది నిజం. ఆన్ లొకేష‌న్ ర‌క‌ర‌కాల చిన్నా చిత‌కా గొడ‌వ‌లు ఉంటాయి కానీ, వాటిని ఈగోల‌కు పోయి పెద్ద‌ది చేసుకుంటేనే స‌మ‌స్య‌. మ‌రి ఆ ముగ్గురి మ‌ధ్యా దిల్‌ రాజు ఎలా స‌యోధ్య కుదిర్చారో తెలియాల్సి ఉందింకా. రామ్‌- అనుప‌మ జంట‌గా త్రినాధ‌రావు న‌క్కిన తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 18న ద‌స‌రా కానుక‌గా రిలీజ్ కానుంది.
Tags:    

Similar News