ప్రకాష్ రాజ్ బహు భాషా నటుడు. అందులో రెండవ మాటకు తావు లేదు. ఆయన స్థాయికీ , సామర్ధ్యానికి మా ప్రెసిడెంట్ అన్నది చాలా చాలా చిన్న పోస్ట్. మరి ఆయన మదిలో పుట్టిందో లేక ఎవరైనా వచ్చి నిలబడమని కోరారో తెలియదు కానీ ప్రకాష్ రాజ్ వచ్చి మా ఎన్నికల రాజకీయంలో బాగానే కూరుకుపోయారు. ఇపుడు ఆయన రోజుకొక తీరున ప్రెస్ మీట్లు పెట్టి వెల్లడిస్తున్న అభిప్రాయాలు చేస్తున్న డిమాండ్లు ఇవన్నీ చూసిన వారికి మాత్రం జాతీయ నటుడు ఇలాగానా అంటూ విస్తుబోవడం అయితే జరుగుతోంది. నిజానికి కమల్ హాసన్ లాంటి జాతీయ నటులు వచ్చినా మా ఎన్నికల్లో నిలబడినా ఓడిస్తారేమో. దానికి కమల్ కూడా అలిగి ఇలా రచ్చ చేస్తే ఆయన విలువ గౌరవం పోగొట్టుకున్నట్లే అవుతుంది తప్ప మరేమీ కాదు. అయినా ప్రకాష్ రాజ్ ని ఓడించింది ఎవరు. ఆయనకు ఆయనే ఓడిపోయారు అనాలి. నిజానికి ఆయన తెలుగు వారు కాదు అనుకుంటే 270కి పైగా వచ్చిన ఓట్లు ఎక్కడివి. అంటే ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ తెలియకనో, విష్ణు ఇచ్చిన హామీలు మా జనాలకు నచ్చో ఇతర కారణాల వల్లనే ఓడారు అనుకోవాలి.
ఇక ఓడిన తరువాత ప్రకాష్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మొదట చెప్పారు. ఆ తరువాత ఇపుడు మళ్ళీ తెలుగేతరులు మా ఎన్నికల్లో పోటీ చేసేలా అవకాశాలు ఉంచుతామని చెబితే తాను రాజీనామా ఉపసంహరించుకుంటానని అంటున్నారు. దీన్ని చూసిన వారు ఒక్క రోజు తేడాలో ఇన్ని రకాల మాటలా, ఆయనకు నిలకడ ఉందా అన్న ప్రశ్నలు లేవనెత్తుకున్నారు. మా ఎన్నికల్లో తనతో పాటు మిగిలిన వారిని రాజీనామా చేయించిన ప్రకాష్ రాజ్ తమకు ఓటేసిన వారి మనోభావాలను దెబ్బ తీశారు అని కూడా చెప్పాలేమో. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గెలుపు ఒకరినే వరిస్తుంది. ఓడిన వారు అంతా ఇలా రాజీనామాల పేరిట పలాయన వాదం పఠితే మరి గెలుపునకు విలువ ఎలా ఉంటుంది.
ఇక మరో మాట ఉంది. మొదటి రోజు మా ఎన్నికలు సజావుగా సాగాయని చెప్పి విష్ణుని అభినందించిన ప్రకష్ రాజ్ ఇపుడు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఇవన్నీ ఓడిన బాధతో ఆయన చేస్తున్నవిగానే సినీ జనాలే కాదు, బయట జనాలు కూడా అనుకునే ప్రమాదం ఉంది. ఇక సినిమా వారి ఎన్నికల్లో రాజకీయాలు ఎందుకు అంటున్న వారికి కూడా ఒకటే సమాధానం. రాజకీయాలు లేనిదెక్కడ. సినీ వర్గానికి చెందిన వారు కూడా బయట ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, రాజకీయ పార్టీలు పెడుతున్నారు కదా.
ఇక తమకు ఓటేసిన మా మెంబర్స్ మీద కూడా ప్రకాష్ రాజ్ మరో బండ వేశారు. ఒకే ప్యానల్ ని సభ్యులు ఎన్నుకోలేదని అంటున్నారు. అసలు ఎక్కడైనా అలా జరుగుతుందా. ఒక్క మా ఎన్నికలే కాదు, ఏ అసోసియేషన్ ఎన్నికలు అయినా మొత్తం ప్యానల్ మెంబర్స్ గెలవడం అరుదు. ఎన్నికలు అన్నవి అయిపోయాక అంతా ఫ్యామిలీగానే ఉండాలి. అలా ఉంటామని చెప్పిన వారికి మళ్లీ అధికార పక్షం, ప్రతిపక్షం అన్న భేదాలు ఎందుకు. ఏది ఏమైనా కళ్ళు మూసుకుంటే రెండేళ్ళ కాలం గిర్రున తిరుగుతుంది. అపుడు మరో మారు లక్ పరీక్షించుకోవచ్చు కదా. మొత్తానికి ప్రకాష్ రాజ్ అనబడే అద్భుత నటుడు మా ఎన్నికల గోదాల పడి విలవిలలాడుతున్నారేమో అనిపిస్తోంది. ఆయన ఉత్సాహం కొద్దీ పోటీ చేశారు, రిజల్ట్ మరోలా వచ్చింది, పెద్ద మనిషిగా దాన్ని స్వీకరించి మెంబర్స్ తనదైన సేవ చేయడం మంచిదేమో.