90ల్లో కోట శ్రీనివాసరావు ఇండియాలోనే బిజియెస్ట్ యాక్టర్ గా ఉండేవారు. ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో సినిమాలు చేసేవారు. ఆయన తర్వాత తెలుగులో అత్యంత బిజీ ఆర్టిస్టుగా గుర్తింపు పొందింది ప్రకాష్ రాజే. ఓ దశాబ్దం పాటు తీరిక లేకుండా నటించాడు ప్రకాష్ రాజ్. నటుడిగా తనకు లైఫ్ ఇచ్చిన తమిళ పరిశ్రమను కూడా పక్కనబెట్టి తెలుగు సినిమాల మీదే దృష్టిపెట్టారాయన. విలన్ పాత్రలతో పాటు హీరోయిన్ తండ్రి పాత్రలకు ఆయనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపించేవారు. మూణ్నాలుగేళ్ల ముందు వరకు ఆయన హవా సాగింది కానీ.. ఈ మధ్య అనుకోకుండా నటుడిగా గ్యాప్ వచ్చేసింది. ప్రకాష్ రాజ్ అనేవాడు ఇండస్ట్రీలో ఒకడున్నాడన్న సంగతే మరిచిపోయారు జనాలు. అయినా నిరుత్సాహ పడకుండా తన అభిరుచి ప్రకారం మెగా ఫోన్ పట్టి సినిమాలు తీసుకుంటున్నాడు ప్రకాష్ రాజ్.
ఆల్రెడీ తెలుగులో తీసిన ‘ఉలవచారు బిర్యానీ’ని ‘తడ్కా’గా హిందీలో రీమేక్ చేస్తుండటమే కాక.. తెలుగు-కన్నడ భాషల్లో ‘మనవూరి రామాయణం’ కూడా తెరకెక్కించాడు ప్రకాష్ రాజ్. ఈ సినిమా విషయంలో మొదట్నుంచి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు ప్రకాష్. కనీసం ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారన్న సంగతి కూడా మొన్నటిదాకా రివీల్ చేయలేదు. కొన్ని రోజుల కిందటే ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసి తాను.. ప్రియమణి ఇందులో ముఖ్య పాత్రలు చేస్తున్న సంగతి బయటపెట్టాడు. లేటెస్టుగా సినిమా కాన్సెప్ట్ ఏంటో కొంచెం హింట్ ఇస్తూ మరో టీజర్ వదిలాడు. ఇవి రెండూ కూడా సినిమా మీద ఆసక్తి రేకెత్తించేలాగే ఉన్నాయి.
మొత్తానికి ప్రకాష్ రాజ్ ఓ వైవిధ్యమైన ప్రయత్నమేదో చేసినట్లే ఉన్నాడు. కథాంశం కూడా కొంచెం సెన్సేషనల్ గా కనిపిస్తోంది. దసరాకు తెలుగులో రాబోతున్న సినిమాలన్నింటి మీద ఇప్పటికే మంచి అంచనాలే ఉన్నాయి. పెద్దగా అంచనాల్లేకుండా రాబోతున్నది ప్రకాష్ రాజ్ సినిమానే. కొన్నిసార్లు ఇలాంటి సినిమాలే అనూహ్యంగా మంచి ఫలితం అందుకుంటుంటాయి. ‘మనవూరి రామాయణం’ ఆ కోవలో చేరితే ఆశ్చర్యమేమీ లేదు. అన్నట్లు దర్శకుడిగా ఇప్పటిదాకా ప్రకాష్ రాజ్ చేసిన మూడు సినిమాలూ రీమేకులే. ఇది ఒరిజినల్. రీమేక్ లతో దెబ్బ తిన్న ప్రకాష్ రాజ్.. తన సొంత స్క్రిప్టుతో చేస్తున్న సినిమా భిన్నమైన ఫలితాన్నిస్తుందేమో చూద్దాం.