ఒకప్పుడు ఏడాదికి తెలుగులోనే 20 సినిమాల దాకా చేసేవాడు ప్రకాష్ రాజ్. ప్రతి పెద్ద సినిమాలోనూ ఆయన కనిపించాల్సిందే అన్నట్లుండేది పరిస్థితి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. నెమ్మదిగా ఆయన సైడ్ అయిపోతున్నాడు. ఈ ఏడాది టెంపర్, సన్నాఫ్ సత్యమూర్తి, సైజ్ జీరో లాంటి ఓ నాలుగైదు సినిమాల్లో మాత్రమే కనిపించినట్లున్నాడీ విలక్షణ నటుడు. ఐతే నటుడిగా విరామం వచ్చిన నేపథ్యంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ.. తన ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేస్తూ జీవితాన్ని తనదైన శైలిలో ఆస్వాదిస్తున్నాడు ప్రకాష్. అంతే కాదు.. తనకెంతో ఇష్టమైన దర్శకత్వం మీద కూడా మళ్లీ దృష్టిపెట్టే అవకాశం దక్కింది ప్రకాష్ రాజ్ కు.
ఇంతకుముందు ధోని, ఉలవచారు బిర్యాని లాంటి సినిమాలు తీసి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు సంపాదించాడు ప్రకాష్ రాజ్. ఇప్పుడాయన దర్శకత్వంలో ‘మన ఊరి రామాయణం’ అనే సినిమా కన్నడ, తెలుగు భాషల్లో తెరకెక్కుతోంది. రెండు నెలల కిందట ప్రకటించిన ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ మినహాయిస్తే ఏ విశేషాలూ ఇప్పటిదాకా బయటకు రాలేదు. నిన్నటికి నిన్న షూటింగ్ పూర్తయిందంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఎక్కడ షూట్ చేస్తున్నాడో.. ఎవర్ని నటింపజేస్తున్నాడో.. అసలు ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడో లేదో కూడా తెలియదు. అసలీ కథ ఏంటన్న సమాచారం కూడా లేదు. ఐతే సినిమా మాత్రం దాదాపుగా పూర్తయిపోయిందట. వచ్చే నెలలో ఆడియో విడుదల చేసి.. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తేవాలన్నది ఆయన ప్లాన్ అట.