మా ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలిసిందే. నువ్వా నేనా అంటూ ఢీ అంటే ఢీ కొట్టారు. ఒక సస్పెన్స్ సినిమా థ్రిల్లర్ గా సాగి చివరికి బిగ్ ట్విస్ట్ లా రిజల్ట్ వచ్చింది. మొదటి నుంచి మంచి కాన్ఫిడెంట్ గా ఉన్న ప్రకాష్ రాజ్ ప్యానల్ అయితే ఈ ఫలితాలతో డీలా పడింది. ఆ తరువాత గెలిచిన వారిని గ్రీట్ చేశారు. ఇక అంతా ఒక్కటిగా ఉంటారు, ఒక కుటుంబంలా మసలుకుంటారు అని అంతా భావించారు. కానీ మొదట మెగా బ్రదర్ నాగబాబు రాజీనామాతో మొదలైన రచ్చ కాస్తా ఆ తరువాత ప్రకాష్ రాజ్ మా సభ్యత్వానికి గుడ్ బై కొట్టడంతో కధ మోరు పెరిగింది.
ఇక మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ తరఫున గెలిచిన మొత్తానికి మొత్తం సభ్యులు రాజీనామా చేశారు. దాంతో సెగ రగులుకుంది. అయితే తాము గెలిచిన టీమ్ కి సహకరిస్తామని, తప్పుంటే మాత్రం కచ్చితంగా ప్రశ్నిస్తామని కూడా చెప్పారు. ఇవన్నీ ఇలా ఉంటే సడెన్ గా ప్రకాష్ రాజ్ పోలింగ్ వేళ జరిగిన మొత్తం వ్యవహారాన్నికి సంబంధించి సీసీ పుటేజ్ కోరడమే ఇక్కడ మాస్టర్ ప్లాన్ అంటున్నారు. పోలింగ్ సజావుగా సాగకుండా మోహన్ బాబు, నరేష్ వంటి వారు అడ్డుకున్నారని ఇప్పటికే ప్రకాష్ రాజ్ ప్యానల్ కి చెందిన సభ్యులు ఆరోపించారు.
ఇపుడు దాన్ని ప్రూవ్ చేసేందుకు ఈ సీసీ ఫుటేజ్ అడిగారు అంటున్నారు. ఇలా సీసీ ఫుటేజ్ కోరడం వెనక పక్కా వ్యూహం కూడా ఉందని ప్రచారం సాగుతోంది. అదెలా అంటే మా ఎన్నికలను రద్దు చేసేలా న్యాయస్థానాన్ని ప్రకాష్ రాజ్ టీమ్ ఆశ్రయించబోతోంది అన్నదే తాజా టాక్. అంటే ప్రశాంతంగా మా ఎన్నికలు జరగలేదని కారణాలు చెబుతూ అందుకు తగిన ఆధారాలను సీసీ ఫుటేజ్ ద్వారా పొందుపరుస్తూ న్యాయ స్థానానికి వెళ్తే జరిగేది ఏంటి అన్న ఉత్కంఠ కూడా ఉంది. మా ఎన్నికలను రద్దు చేయించాలన్న ప్లాన్ కూడా దీని వెనక ఉందని కూడా ప్రచారం అయితే సాగుతోంది. మరి ప్రకాష్ రాసిన లేఖకు మా ఎన్నికల అధికారి సీసీ ఫుటేజ్ ఇచ్చేందుకు అంగీకరించారు. మరి అది కనుక చేతిలో ఉంటే బ్రహ్మాస్త్రమే దొరికినట్లుగా ఆ ప్యానల్ భావిస్తోంది. మొత్తానికి మా ఎన్నికలు రద్దు చేయించే దిశగా కధ సాగుతోందా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో. మొత్తానికి మా ఎన్నికలతో వేడి చల్లారలేదు, కధ సమాప్తం కాలేదు, ఇంకా ఇంటర్వెల్ దాకానే సినిమా వచ్చింది అన్నదే నిజం అంటున్నారు.