అత్తారింటికి దారేది చిత్రంతో టాలీవుడ్ కి బాపు బొమ్మగా మారిపోయిన కన్నడ సుందరి ప్రణీతా సుభాష్. పవన్ కళ్యాణ్ తో నటించడం కారణంగా ఓవర్ నైట్ లో క్రేజీ హీరోయిన్ అయిపోయింది కానీ.. ఆ తర్వాత మాత్రం కాలం కలిసి రాలేదు. సక్సెస్ లు ఖాతాలో పడకపోవడంతో.. మెల్లగా ఆఫర్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు అమ్మడి చేతిలో తెలుగు సినిమాలు అసలు లేనే లేవు.
అయితే.. తనకు వచ్చిన అవకాశాల నుంచి చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నానని చెబుతోన్న ప్రణీతా సుభాష్.. వస్తున్న ఛాన్సులపై సంతృప్తిగానే ఉన్నానంటోంది. తెలుగులో సినిమాలు లేకపోయినా.. కన్నడ.. తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగానే ఉంది ఈ బ్యూటీ. "ప్రస్తుతం శాండల్ వుడ్.. కోలీవుడ్ ల మధ్య చక్కర్లు కొడుతున్నాను. టాలీవుడ్ నుంచి కూడా కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. అయితే.. అవేమీ మరీ ఆసక్తి కలిగించేలా లేవు. నేను చేసిన పాత్రలే నా గురించి చెప్పాలనే తపన నాది. ఎక్కువ సినిమాలు చేసేయాలనే కోరిక నాకు లేదు" అని చెబుతోంది ప్రణీతా సుభాష్.
"రీసెంట్ గా కన్నడలో మాస్ లీడర్ మూవీ చేశాను. ఇందులో గృహిణి పాత్ర చేసిన నాకు.. మంచి గుర్తింపు లభించింది. అళాగే తమిళ్ లో ఓ మూవీలో సరదాగా జీవించే అమ్మాయి రోల్ చేశాను. నాకు ఇలాంటి వైవిధ్యమైన పాత్రలు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఒకే తరహా మూస రోల్స్ కాకుండా.. వివిధ ఇండస్ట్రీలలో వేర్వేరు పాత్రలు వస్తున్నందుకు ఐ యామ్ సో హ్యాపీ"అంటోంది డైనమైట్ బ్యూటీ ప్రణీతా సుభాష్.