పాపం పాప.. షాకులో ఉన్నట్లుంది

Update: 2016-08-26 10:06 GMT
అప్పట్లో అత్తారింటికి దారేదిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన బాపు బొమ్మగా మెరిసిన తర్వాత.. ప్రణీతా సుభాష్ రేంజ్ మారిపోయింది. వరుసగా తెలుగులో సినిమాలు చక్కబెట్టేసింది. మంచు హీరోల పక్కన రెండు సినిమాలు.. ఎన్టీఆర్ తో రభస చేసేసిన ప్రణీతకు.. మహేష్ తో కూడా ఛాన్స్ వచ్చింది. కానీ సూపర్ స్టార్ తో కలిసి నటించిన బ్రహ్మోత్సవం నిరాశపర్చడంతో అసలు కనిపించడమే మానేసింది.

తాజాగా బెంగళూరులో హైద్రాబాద్ చెఫ్స్ ప్రారంభానికి వచ్చి.. రిబ్బన్ కటింగ్ చేసింది ప్రణీత. అభిమానులతో కలిసి సెల్ఫీలు తీసుకోవడమే కాదు.. ఫుడ్ ని కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేసింది. మొహంలో నవ్వు బాగానే పులుముకుంది కానీ.. అమ్మడు ఇంకా బ్రహ్మోత్సవం షాక్ నుంచి పూర్తిగా కోలుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. ఇంతగా షాక్ తినేయడానికి కారణం ఉంది లెండి. మహేష్ తో ఛాన్స్ వచ్చిన తర్వాత.. కన్నడ సినిమాల నుంచి టాలీవుడ్ కి జంప్ అయ్యేందుకు బాగానే ప్లాన్స్ వేసుకుంది ఈ భామ.

అందుకే సీసీఎల్ మ్యాచ్ లలో కర్నాటక టీమ్ కి బదులుగా తెలుగు వారియర్స్ ను కూడా సపోర్ట్ చేసి.. అక్కడి జనాలతో తిట్లు తింది. కానీ బ్రహ్మోత్సవం రిజల్ట్ తేడా రావడంతో ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు. అక్కడ కూడా చేతిలో ఒక సినిమా తప్ప ఆఫర్లు లేవు. అదీ అమ్మడి షాక్ కి అసలు రీజన్. అర్ధమైందా..
Tags:    

Similar News