'కేజీఎఫ్' హిట్ తో ప్రశాంత్ నీలు...'ఖైదీ'..'విక్రమ్' విజయాలతో లోకేష్ కనగరాజ్ పేర్లు పాన్ ఇండియా వైడ్ మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. కమర్శియల్ గా ఇద్దరు దర్శకులు సినిమాలు అతి పెద్ద విజయాలుగా నిలవడంతోనే ఈ రేంజ్ లో పాపులర్ అవుతున్నారు. ప్రస్తుతం ఇద్దరు దర్శకులు ఎవరికి వారు బిజీగా ఉన్నారు.
ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్ -2' సమయంలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో 'సలార్' సినిమా లాక్ చేసారు. ప్రస్తుతం ఆ సినిమా సెట్స్ లో ఉంది. ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నారు. అటుపై మరికొంత మంది హీరోలు ప్రశాంత్ క్యూలో ఉన్నారు. ముందు వరుసలో రామ్ చరణ్ పేరు వినిపిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ కూడా ప్రశాంత్ తో సినిమా చేయాలని ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఉన్నారు.
ఇక లోకేష్ కనగరాజ్ ని కోలీవుడ్ అగ్ర హీరోలంతా రౌండప్ చేసి ఉన్నారు. రజనీకాంత్...అజిత్ కుమార్..సూర్య ..విజయ్ లాంటి స్టార్ హీరోలు ఆయనతో సినిమా చేయాలని ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకా కొంత మంది తెలుగు హీరోలు కూడా లోకేష్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ అభిమానులు ఇద్దరి కాంబినేషన్ ఎప్పుడు? అంటూ ఈ విషయాన్ని పబ్లిక్ గానే రివీల్ చేసారు.
ఇలా ఇద్దరు సౌత్ దర్శకులిద్దరు దక్షిణాది సినిమా సత్తాని దేశ వ్యాప్తంగా చాటారు. అందుకే ఇప్పుడు ఈ ఇద్దరి పై బాలీవుడ్ కన్ను కూడా పసినట్లు తెలుస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్ లో కరణ్ జోహార్..యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లు ఇద్దరు దర్శకులపై అప్పుడే ఎర ప్రయత్నం మొదలు పెట్టినట్లు లీకులందుతున్నాయి. రెండు సంస్థలు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి తమ బ్యానర్లో సినిమాలు చేయాల్సిందిగా రాయబారాలు పంపుతున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.
అడ్వాన్సుల రూపంలో కోట్ల రూపాయలు ఇవ్వాలని రెండు సంస్థలు ప్లాన్ చేస్తున్నాయట. ఈ విషయాలు బయట ఎక్కడా పొక్కకుండా అత్యంత గోప్యంగా డీల్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఇదంత ఈజీ కాదు. ఒకవేళ కమిట్ అయిన ఇప్పట్లో చేయడానికి ఆస్కారం లేదు. ప్రశాంత్ నీల్ కి టాలీవుడ్ లోనే బోలెడన్ని ఆఫర్లు ఉన్నాయి.
అతని కోసం స్టార్ హీరోలే క్యూ లో ఉన్నారు. బడా నిర్మాణ సంస్థలు వందల కోట్లు వెచ్చించడానికి రెడీగా ఉన్నాయి. హోమ్ బ్యానర్లా నిలిచిన హోంబోలే ఫిల్మ్స్ ని వదిలి బయటకు రావడమే చాలా కష్టమైన పని. ఏ హీరో సినిమా చేయాలన్నా..ఏ బ్యానర్ నిర్మించాలన్నా...హోంబోలే ఫిల్మ్స్ భాగస్వామ్యంలోనే చేయాల్సి ఉంటుంది.
ఇక లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ ని వలడానికే ఛాన్స్ లేదు. అంతటి క్రియేటివ్ మేకర్ ని అక్కడి హీరోలు ఏమాత్రం బయటకి పంపడానికి ఒప్పుకోరు. విషయం ఉన్న కంటెంట్ మొత్తం ఆవిష్కరించిన తర్వాత లొకేష్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. శంకర్..మురగదాస్ లానే లోకేష్ కూడా ఇతర భాషల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.