'కేజీఎఫ్' హిట్ తో పాన్ ఇండియాలో ఫేమస్ అయ్యాడు ప్రశాంత్ నీల్. ఒక్క హిట్ అతని స్థాయినే మార్చేసింది. ఎవరీ సంచలనమని దేశమే ఒక్కసారి అతని వైపు తలతిప్పి చూస్తుంది. టాలీవుడ్..కోలీవుడ్..బాలీవుడ్ ఇలా అన్ని వుడ్ స్టార్స్ ప్రశాంత్ తో ఒక్క సినిమాకైనా పనిచేయాలని ఆశపడుతున్నారు. అంతటి సంచలనాన్ని ప్రేక్షకులంతా కన్నడిగే అనుకుంటున్నారు.
కానీ అతను తెలుగు వాడు అని తెలిసింది చాలా తక్కువ మందికే. అవును ప్రశాంత్ నీల్ తెలుగు గడ్డపై పుట్టిన సీమ బిడ్డ. రాయలసీమ ప్రాంతంలో ని అనంతపురం నుంచి కొత్త జిల్లాగా ఏర్పాటైన సత్యసాయి జిల్లా మడక సిర మండలంలోని ఓ మారు మూల నీలకంఠపురం గ్రామానికి చెందిన వాసి. పుట్టింది ఇక్కడే. అతని బంధువులు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు.
మాజీ మంత్రి..కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి స్వయాన ప్రశాంత్ కి బాబాయ్ అవుతారు. స్వాత్రత్య దినోత్సవం సందర్భంగా నిన్నటి రోజున స్వగ్రామాన్ని సందర్శించాడు. ఊరితో తన జ్ఞాపకాల్ని పంచకున్నాడు. రఘువీరా రెడ్డితో కలిసి అక్కడ దేవాలయాన్ని...ఎల్ . వి. ప్రసాద్ కంటి ఆసుపత్రిని సందర్శించాడు. ఈ సందర్భంగా స్వగ్రామ అభివృద్ది కోసం 50 లక్షలు విరాళం ప్రకటించాడు.
ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ రఘువీరా రెడ్డి కుటుంబానికి చెందిన వాడు అని ఏనాడు చెప్పుకోలేదు. తొలిసారి గ్రామాన్ని సందర్శించిన నేపథ్యంలో తన సోదరుడు కోడుకు అన్న విషయాన్ని బహిర్గతం చేసారు. ఇక ప్రశాంత్ సైతం నిన్నటి రోజున ఊరి గురించి ముచ్చటించారు. ''అందరికీ ప్రశాంత్ నీల్ గా తెలుసు. కానీ నా అసలు పేరు నీలకంఠాపురం. ఇదే నా అడ్రస్ అంటూ గర్వంగా'' చెప్పుకొచ్చాడు.
అయితే ప్రశాంత్ చిన్నవయసులో కుటుంబం బెంగుళూరుకి షిప్ట్ అయింది. అక్కడే పెరిగాడు. అక్కడే చదువుకున్నాడు. ఈ క్రమంలోనే కన్నడ పరిశ్రమకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. కేజీఎఫ్ అనే పాన్ ఇండియా సినిమా చేసి ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు తెలుగు బిడ్డగా ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాడు. 'కేజీఎఫ్' ప్రచారం సమయంలో ప్రశాంత్ ఎంతో చక్కగా తెలుగులోనే మాట్లాడారు.
తెలుగు భాషని అర్ధం చేసుకున్నారు. అప్పుడే ప్రశాంత్ తెలుగు వారా? అన్న సందేహం మీడియాలో తెరపైకి వచ్చింది. ఇప్పుడది నిజమైంది.'బాహుబలి'తో ఫేమస్ అయిన రాజమౌళి తెలుగు వారు కావడం ఎంతో గర్వం చెప్పుకున్న అభిమానులు ఇప్పుడు ప్రశాంత్ సైతం అదే గడ్డపై పుట్టిన బిడ్డ కావడంతో మరింత గర్వంగా ఫీలవుతున్నారు.Full View
కానీ అతను తెలుగు వాడు అని తెలిసింది చాలా తక్కువ మందికే. అవును ప్రశాంత్ నీల్ తెలుగు గడ్డపై పుట్టిన సీమ బిడ్డ. రాయలసీమ ప్రాంతంలో ని అనంతపురం నుంచి కొత్త జిల్లాగా ఏర్పాటైన సత్యసాయి జిల్లా మడక సిర మండలంలోని ఓ మారు మూల నీలకంఠపురం గ్రామానికి చెందిన వాసి. పుట్టింది ఇక్కడే. అతని బంధువులు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు.
మాజీ మంత్రి..కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి స్వయాన ప్రశాంత్ కి బాబాయ్ అవుతారు. స్వాత్రత్య దినోత్సవం సందర్భంగా నిన్నటి రోజున స్వగ్రామాన్ని సందర్శించాడు. ఊరితో తన జ్ఞాపకాల్ని పంచకున్నాడు. రఘువీరా రెడ్డితో కలిసి అక్కడ దేవాలయాన్ని...ఎల్ . వి. ప్రసాద్ కంటి ఆసుపత్రిని సందర్శించాడు. ఈ సందర్భంగా స్వగ్రామ అభివృద్ది కోసం 50 లక్షలు విరాళం ప్రకటించాడు.
ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ రఘువీరా రెడ్డి కుటుంబానికి చెందిన వాడు అని ఏనాడు చెప్పుకోలేదు. తొలిసారి గ్రామాన్ని సందర్శించిన నేపథ్యంలో తన సోదరుడు కోడుకు అన్న విషయాన్ని బహిర్గతం చేసారు. ఇక ప్రశాంత్ సైతం నిన్నటి రోజున ఊరి గురించి ముచ్చటించారు. ''అందరికీ ప్రశాంత్ నీల్ గా తెలుసు. కానీ నా అసలు పేరు నీలకంఠాపురం. ఇదే నా అడ్రస్ అంటూ గర్వంగా'' చెప్పుకొచ్చాడు.
అయితే ప్రశాంత్ చిన్నవయసులో కుటుంబం బెంగుళూరుకి షిప్ట్ అయింది. అక్కడే పెరిగాడు. అక్కడే చదువుకున్నాడు. ఈ క్రమంలోనే కన్నడ పరిశ్రమకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. కేజీఎఫ్ అనే పాన్ ఇండియా సినిమా చేసి ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు తెలుగు బిడ్డగా ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాడు. 'కేజీఎఫ్' ప్రచారం సమయంలో ప్రశాంత్ ఎంతో చక్కగా తెలుగులోనే మాట్లాడారు.
తెలుగు భాషని అర్ధం చేసుకున్నారు. అప్పుడే ప్రశాంత్ తెలుగు వారా? అన్న సందేహం మీడియాలో తెరపైకి వచ్చింది. ఇప్పుడది నిజమైంది.'బాహుబలి'తో ఫేమస్ అయిన రాజమౌళి తెలుగు వారు కావడం ఎంతో గర్వం చెప్పుకున్న అభిమానులు ఇప్పుడు ప్రశాంత్ సైతం అదే గడ్డపై పుట్టిన బిడ్డ కావడంతో మరింత గర్వంగా ఫీలవుతున్నారు.