సోషల్ మీడియాకు స్టార్ డైరెక్టర్ గుడ్ బై..!

Update: 2023-01-11 06:12 GMT
కె.జి.ఎఫ్ తో సెన్సేషనల్ విక్టరీ సాధించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కె.జి.ఎఫ్ ఫ్రాంచైజ్ తో స్టార్ డైరెక్టర్ గా నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో ఉన్నాడు. అతను చూపించిన హీరోయిజానికి సాధారణ ఆడియన్స్ కూడా ఫ్యాన్స్ అయిపోయారు. కె.జి.ఎఫ్ 2 తర్వాత ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఆ సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నాడు. సలార్ వర్క్ లో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ సడెన్ గా తన ట్విట్టర్ ఖాతాని డిలీట్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు.

రీసెంట్ గా కె.జి.ఎఫ్ హీరో యశ్ కి బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేశాడు ప్రశాంత్ నీల్. అదే అతని చివరి ట్వీట్. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తన ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేశాడు. అయితే ప్రశాంత్ నీల్ ఇలా చేయడానికి గల కారణాలు రెండు ఉన్నాయని అంటున్నారు. అందులో ఒకటి సలార్ సినిమాను పూర్తి చేసేందుకు తన ఫోకస్ అంతా సినిమా మీద పెట్టేలా.. కొన్నాళ్లు సోషల్ మీడియాకి దూరంగా ఆఫ్ లైన్ లో ఉండాలనే ఆలోచనతో ప్రశాంత్ నీల్ తన ట్విట్టర్ ఖాతా డిలీట్ చేశాడని అంటున్నారు.

ఇక మరోపక్క యశ్ కి చెప్పిన బర్త్ డే విషెస్ మెసేజ్ ఉర్దూలో పెట్టాడు. అయితే దాని వల్ల ప్రశాంత్ నీల్ పై నెటిజన్లు బాగా ఆడేసుకున్నారు అది తట్టుకోలేకనే ప్రశాంత్ నీల్ తన ట్విట్టర్ ఖాతా డిలీట్ చేశాడని అంటున్నారు. వీటిలో ఏది నిజమో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రశాంత్ నీల్ అఫీషియల్ గా కూడా తన ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేశానన్న స్టేట్ మెంట్ ఇవ్వలేదు. మరి అక్కడ అసలేం జరుగుతుంది అన్నది తెలియాల్సి ఉంది.

సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. తారక్ 31వ సినిమా కచ్చితంగా ప్రశాంత్ నీల్ తోనే ఉంటుందని చెప్పొచ్చు. ఈ విషయంపై కూడా కన్నడ ఆడియన్స్ ప్రశాంత్ నీల్ మీద ఆగ్రహంగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ ఎందుకు సోషల్ మీడియా అకౌంట్ ని డిలీట్ చేశాడు అన్న దానికి ఆన్సర్ రావాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News