'కింగ్' నాగ్ ని డైరెక్ట్ చేయబోతున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్...?

Update: 2020-06-13 15:00 GMT
ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 'లవ్ స్టోరీ' సినిమాతో మూవీ ప్రొడక్షన్ లోకి దిగుతున్న విషయం తెలిసిందే. అక్కినేని నాగ చైతన్య - సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. నారాయణదాస్ కె నారంగ్ మరియు ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేయాలని భావించారు. కానీ దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన కుదరలేదు. కాగా ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు తీయాలని ఏసియన్ వారు నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలో మళ్ళీ శేఖర్ కమ్ముల తోనే మరో ప్రాజెక్ట్ నిర్మించనున్నారట. ఈ సినిమాలో ఓ స్టార్ హీరో నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ తో పాటు కింగ్ నాగార్జున తో కూడా ఒక సినిమాకి డేట్స్ సంపాదించారట ఏసియన్ ప్రొడ్యూసర్స్. నాగచైతన్య తో సినిమా తీస్తున్న ఈ ప్రొడక్షన్ హౌస్ వెంటనే అతని తండ్రి నాగార్జున తో కూడా సినిమా స్టార్ట్ చేయబోతున్నారట. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ చేయబోతున్నాడట.

'చందమామ కథలు' సినిమా తీసి నేషనల్ అవార్డ్ అందుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన ప్రవీణ్ సత్తారు 'LBW' సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత 'రొటీన్ లవ్ స్టోరీ' 'చందమామ కథలు' 'గుంటూరు టాకీస్' 'PSV గరుడవేగ’ చిత్రాలతో టాలీవుడ్ లో సమ్ థింగ్ డిఫరెంట్ డైరెక్టర్ అనిపించుకున్నాడు ప్రవీణ్. లిమిటెడ్ బడ్జెట్ లో హై క్వాలిటీ సినిమా ఇవ్వడం ప్రవీణ్ సత్తారు గొప్పతనం. అలాంటి ప్రతిభావంతమైన దర్శకుడికి అక్కినేని కాంపౌండ్ లో చోటు దక్కబోతోందట. అక్కినేని నాగార్జున కొత్త దర్శకులతో.. చిన్న సినిమాలు తీసే టాలెంటెడ్ డైరెక్టర్స్ తో సినిమా చేయడానికి ఎప్పుడూ ముందే ఉంటాడు. ప్రస్తుతం నాగ్ 'వైల్డ్ డాగ్' అనే కాప్ డ్రామాలో నటిస్తున్నాడు. నాగ్ 'నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెంట్'గా కనిపిస్తున్న ఈ సినిమాతో సోలోమన్ అనే న్యూ డైరెక్టర్ టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత నాగార్జున - ప్రవీణ్ కాంబోలో మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. ఇదే కనుక నిజమైతే ఇప్పటి వరకు రాజశేఖర్ మినహా స్టార్ హీరోలతో సినిమా చేయని ప్రవీణ్ సత్తారు.. కింగ్ నాగార్జున ని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.
Tags:    

Similar News