ఆచార్య అవ్వకుండానే ఆ రీమేక్‌ మొదలయ్యేనా?

Update: 2020-06-28 13:30 GMT
మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య ను మూడు నెలల్లోనే పూర్తి చేసి ఈ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్నారు. కాని పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఆచార్య చిత్రం వచ్చే ఏడాది వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదనిపిస్తుంది. ఆచార్య చిత్రం షూటింగ్‌ ఇంకా సగానికి పైగా ఉంది అనేది టాక్‌. ఆగస్టు లేదా సెప్టెంబర్‌ నుండి ఆచార్య చిత్రీకరణ షురూ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరో వైపు చిరు మరో మూవీకి కూడా ఏర్పాట్లు జరిగి పోతున్నాయి.

మలయాళ బ్లాక్‌ బస్టర్‌ లూసీఫర్‌ చిత్రంను చిరంజీవి రీమేక్‌ చేయబోతున్నాడు. అధికారికంగా ప్రకటన రాకున్నా కూడా రీమేక్‌ కు సంబంధించిన ఏర్పాట్లు జరిగి పోతున్నాయి. లూసీఫర్‌ చిత్రం రీమేక్‌ బాధ్యతలను సాహో దర్శకుడు సుజీత్‌ కు మెగా కాంపౌండ్‌ అప్పగించింది. లూసీఫర్‌ కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చడంతో పాటు మెగా సూచన మేరకు స్క్రిప్ట్‌ లో పలు మార్పులు చేర్పులను సుజీత్‌ చేశాడట.

స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అవ్వడంతో ప్రస్తుతం సాయి మాధవ్‌ బుర్రా డైలాగ్‌ వర్షన్‌ ను సిద్దం చేస్తున్నాడట. ఈ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ స్పీడ్‌ చూస్తుంటే ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు రాక ముందే ఆ మాటకు వస్తే ఆచార్య షూటింగ్‌ పూర్తి కాకుండానే ఈ రీమేక్‌ కు చిరంజీవి రెడీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరంజీవి స్టార్‌ డంకు ఆయన వయసుకు తగ్గట్లుగా లూసీఫర్‌ లో మార్పులు చేర్పులు చేశారు.

ఒరిజినల్‌ వర్షన్‌ లో మంజు వారియర్‌ చేసిన పాత్రను తెలుగులో ఎవరితో చేయిస్తారనే విషయమై చాలా ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విజయశాంతితో పాటు పలువురి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. కాని షూటింగ్‌ మొదలు పెట్టే సమయంలో నటీనటుల విషయమై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News