ఫైట్ కోసం బావి తవ్వించిన ప్రీతి

Update: 2016-06-15 12:50 GMT
అవును.. ఒక ఫైట్ కోసం ప్రీతి జింటా నుయ్యి తవ్వించిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అంతే కాదు.. ఆ బావికి తనే ఓపెనింగ్ కూడా చేసేసింది. అసలు ఫైట్ కోసం నుయ్యి తవ్వడమేంటని అనుకోవడం సహజమే కానీ.. అది జనాల మధ్య ఫైట్ కాదు.. జనాల కోసం కరువుపై చేస్తున్న పోరాటం.

మహరాష్ట్ర ఇప్పుడు నీటి ఇబ్బందులకు కటకటలాడుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్య నుంచి ఓ గ్రామానికి శాశ్వత పరిష్కారం అందించే ఏర్పాటు చేసింది ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ లెవెన్ ఓనర్. ఐపీఎల్ కారణంగానే ఈ సమస్యకు బాగా ప్రాచుర్యం లభించిందని చెప్పచ్చు. అక్కడ మొదలైన ఆలోచన.. ఇప్పుడో ఊరి కష్టాలను తూర్చింది. నాసిక్ సమీపంలోని ఓ గ్రామం కరువు కారణంగా ఇబ్బంది పడుతుండడాన్ని.. నీరు లేక ఈ ఊరి మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకున్న ప్రీతి జింటా.. వెంటనే ఆ ఊరి బావి తవ్వించేందుకు చర్యలు చేపట్టింది.

రీసెంట్ గా ఆ బావిని తనే ప్రారంభించి.. ఎందరికో ఆదర్శంగా నిలించింది. 'నీటిని పొదుపు చేయడానికి.. ఉపయోగించుకోవడానికి ఈ బావి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మంచి పని చేసేందుకు సహాయపడ్డ అందరికీ కృతజ్ఞతలు' అని చెప్పింది ప్రీతి జింటా. ఇప్పుడు హీరోయిన్లు చేసే ఓపెనింగ్స్ అంటే మాల్స్ - జ్యూవెలరీ స్టోర్స్ ఉంటాయి. కానీ ఓ ఊరికి మంచి చేసేందుకు నుయ్యి తవ్వించిన ప్రీతికి ప్రశంసలు దక్కుతున్నాయి.
Tags:    

Similar News