ప్రీతి జింతా.. నెస్ వాడియా ఒకప్పుడు ప్రేమికులు. ఇద్దరూ వ్యాపార భాగస్వాములుగా కూడా మారారు. ఐపీఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ను వాటా కొన్నారు. పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డారు ఒక సమయంలో. కానీ తర్వాత ఏమైందో ఏమో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. తర్వాత విభేదాలు తీవ్రమై.. ఒక దశలో వాడియా మీద ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేసేవరకు పరిస్థితి వచ్చింది. తనను వాడియా దూషించాడని.. లైంగికంగా వేధించాడని కేసు పెట్టింది ప్రీతి. ఐతే ఇప్పుడు ఆ గొడవలన్నీ పక్కకు వెళ్లిపోయాయి. ఇద్దరూ మళ్లీ స్నేహితులైపోయారు. చాలా సఖ్యతతో కనిపిస్తున్నారు.
ఐపీఎల్ కొత్త సీజన్ ఆరంభమైనప్పటి నుంచి ప్రీతి.. వాడియా సన్నిహితంగా కినిపిస్తున్నారు. పంజాబ్ మ్యాచ్ ల సందర్భంగా స్టాండ్స్ లో ఇద్దరూ ముచ్చటించుకుంటూ కనిపించడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధించిన అనంతరం ఇద్దరూ తమ జట్టు ఆటగాళ్లతో కలసి సంబరాలు కూడా చేసుకున్నారు. తనను లైంగికంగా వేధించాడని ఆరోపించిన వ్యక్తితో మళ్లీ ఇలా ప్రీతి సన్నిహితంగా కనిపించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. వాడియా నుంచి విడిపోయాక జీన్ గుడ్ ఎనఫ్ అనే విదేశీయుడితో ప్రేమాయణం మొదలుపెట్టి అతడినే ప్రీతి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.